రాజధాని అమరావతిలోని ఇ-13 రోడ్డుని చెన్నై-కోల్కతా జాతీయ రహదారి (ఎన్హెచ్-16)తో అనుసంధానించేందుకు, ఇ-15 రోడ్డుని మంగళగిరిలోని పాత బస్టాండ్ వరకు విస్తరించేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) టెండర్లు పిలిచింది. ఇ-15కి రూ.70 కోట్లు, ఇ-13కి రూ.384.78 కోట్లు అంచనా వ్యయంగా పేర్కొంది. రాజధాని మాస్టర్న్ ప్రకారం.. ఈ రహదారుల్ని జాతీయ రహదారి వరకు పొడిగించే ప్రతిపాదన లేదు. అమరావతిలోకి బయటి ప్రాంతాల నుంచి సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా ఇ-5, ఇ-11, ఇ-13, ఇ-15 రహదారుల్ని విస్తరించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. డీపీఆర్లు రూపొందించే బాధ్యత లీ కన్సల్టెన్సీకి అప్పగించింది. రాజధానిలో పశ్చిమ బైపాస్ రహదారి నుంచి మొదలయ్యే ఇ-15 రోడ్డుని మంగళగిరిలోని పాతబస్టాండ్ వద్ద పాత మద్రాసు రహదారితో అనుసంధానిస్తారు. రాజధాని సరిహద్దు నుంచి మంగళగిరిలోని పాత బస్టాండ్ వరకు రోడ్డు పొడవు 2.3 కి.మీ.లు వస్తుంది. దీన్ని మంగళగిరిలో పాత మద్రాసు రహదారితో అనుసంధానించేందుకు అక్కడో ఫ్లైఓవర్ నిర్మిస్తారు.

ఇది కూడా చదవండి: నేను తప్పు చేశా క్షమించండి.. వైసీపీ ఎమ్మెల్యే సంచలనం! కారణం ఇదే!

దానితో కలిపి మొత్తం పొడవు 3.52 కి.మీ.లు వస్తుంది. ఇ-13 రహదారి రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం యర్రబాలెం దగ్గర ఆగిపోతుంది. ఆ రోడ్డును ఇప్పుడు ఎయిమ్స్కు ఉత్తరం దిక్కు సరిహద్దుని ఆనుకుని జాతీయ రహదారి వరకు పొడిగిస్తారు. డీజీపీ ఆఫీసుకు దగ్గర్లో ఎన్హెచ్-16తో దీన్ని అనుసంధానిస్తారు. అక్కడ ట్రంపెట్ ఆకారంలో ర్యాంప్లు, లూప్లు నిర్మిస్తారు. వాటితో కలిపి మొత్తం 7.2 కి.మీ. పొడవున రోడ్డు వస్తుంది. ఇ-13, ఇ-15 రహదారుల్ని రాజధాని వెలుపల భాగంలో కూడా... వరద నీటి డ్రెయిన్లు, యుటిలిటీ డక్ట్లు వంటి అన్ని సదుపాయాలతో నిర్మిస్తారు. ఇ-5, ఇ-11 రహదారుల విస్తరణకు మలి దశలో టెండర్లు పిలవనున్నారు. ఈ రెండు రోడ్లను ఎన్హెచ్-16తో అనుసంధానిస్తారు. భూసేకరణ అవసరం లేకుండా ఈ రహదారుల్ని తాడేపల్లిలోని కొండల్ని ఆనుకుని తీసుకెళ్లి ఎన్హెచ్-16లో కలపాలన్నది ఆలోచన. ఇ-5 రహదారి ప్రతిపాదిత మార్గంలో కొంత అటవీ భూమి ఉంది. అక్కడ రోడ్డు వేయాలంటే కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అనుమతి కావాలి. ప్రస్తుతం సంప్రదింపుల ప్రక్రియ జరుగుతోంది. అటవీశాఖ అనుమతివ్వడాన్ని బట్టి ఆ రహదారి అలైన్మెంట్ను సిద్ధం చేయనున్నారు. ఇ-11 రహదారికి సంబంధించి డీపీఆర్ సిద్ధమవుతోంది. ఆ వెంటనే దానికీ టెండర్లు పిలుస్తారు.

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.!

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group