బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరుకానున్నారు. దాదాపు పది రోజుల క్రితం ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేసి, ఈరోజు విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు.
తెలంగాణలోని పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నం ప్రాంతాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల పరిధిలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈడీ అధికారులు విచారణ కోసం ప్రకాశ్ రాజ్‌తో పాటు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి తదితరులకు కూడా నోటీసులు పంపారు.
ఈడీ విచారణలో ప్రకాశ్ రాజ్ ప్రమోట్ చేసిన యాప్స్, వాటికి సంబంధించిన చెల్లింపులు, ఒప్పందాలు వంటి అంశాలపై వివరాలు సేకరించే అవకాశముంది. ఈ కేసు సినీ పరిశ్రమలో కలకలం రేపుతుండగా, అధికారులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.