ఇది కూడా చదవండి: Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బు జమ కాలేదా? ఇవాళ్టితో ముగియనున్న 'ఆ' గడువు!
వార్తలు చెప్పే వాళ్ల మీదే ఇప్పుడు వార్తలే వస్తున్నాయంటే పరిస్థితి ఎంత ఘర్షణాత్మకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్లో(Hyderabad)ని మహా టీవీ కార్యాలయం వద్ద ఊహించని ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్(KTR) పేరును ప్రస్తావిస్తూ ప్రసారం చేసిన కథనాలకు నిరసనగా BRS కార్యకర్తలు రోడ్డెక్కారు. కానీ అది నిరసనతో ఆగకుండా.. ఏకంగా ఆఫీసులోకి జొరబడి, అద్దాలు పగులగొట్టారు, కార్లను ధ్వంసం చేశారు, స్టూడియోకు హాని కలిగించారు. కొన్ని నిమిషాల్లోనే ఆ ప్రాంతం సంగ్రామ భూమిగా మారిపోయింది.
ఇది కూడా చదవండి: BJP President: బీజేపీ శ్రేణులకు తీపి కబురు.. జూలై 1న రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక!
కథనాలపై అభ్యంతరం ఉన్నా అది చర్చలకే పరిమితం కావాలి కాని, కొందరు చర్యలకు దిగడం ఆందోళన కలిగించే విషయమని మీడియా ప్రతినిధులు అంటున్నారు. మహా టీవీ(Maha TV) కార్యాలయంలోని అద్దాలు పగులగొట్టడం, పార్కింగ్లో నిలిపి ఉంచిన వాహనాల మీద రాళ్లు విసరడం మొదలయ్యాయి. సిబ్బంది గబగబా పరుగు తీసే పరిస్థితి. స్టూడియోలోని కెమెరాలు, లైటింగ్ పరికరాలు ధ్వంసమయ్యాయి. ఘటన తీవ్రత ఇంతలా ఉందంటే, అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందే ఒక్కసారిగా ఏమి జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయామని స్థానికులు తెలిపారు.
ఇది కూడా చదవండి: New Railway Lines: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!
ఇటీవల తెలంగాణ(Telangana) రాజకీయాల్లో ఫోన్(Phone) ట్యాపింగ్ వ్యవహారం బాగా హీటెక్కింది. అనేక మీడియా సంస్థలు ఈ అంశాన్ని పట్టు పట్టి కథనాలు ప్రసారం చేస్తున్నాయి. మహా టీవీ కూడా ఇదే తరహాలో న్యూస్ టెలికాస్ట్ చేసినట్టు సమాచారం. ఇందులో మాజీ మంత్రి కేటీఆర్ పేరు రావడంతో BRS వర్గాలు తీవ్రంగా స్పందించాయి. కేటీఆర్(BRS) ఇప్పటికే ఈ ఆరోపణలను ఖండించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై లీగల్ నోటీసులు పంపించినట్టు సమాచారం. అయినా మహా టీవీ ప్రసారించిన విషయంపై కార్యకర్తలు ఆగ్రహాన్ని చట్ట వ్యతిరేకంగా ప్రదర్శించారని విమర్శలు వినిపిస్తున్నాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు!
Ration Card: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జూన్ 30 వరకే ఛాన్స్..! ఇలా చేయకపోతే రేషన్ కార్డ్ రద్దు!
Ration Supply: రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ఇక నుండి ఇలా!
Toll Plazas: బీ అటెన్షన్! వారికి టోల్ ప్లాజాతో పనిలేదు... ఓఆర్ఆర్ పై దూసుకెళ్లిపోవచ్చు!
TTD Devotees: భక్తులకు శుభవార్త! తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ!
Real Estate Fraud: వైసీపీ నేత కుమారుడి నయా దందా.. రూ.8 కోట్లతో పరార్! అరెస్టు చేసిన పోలీసులు!
Paytm UPI: పేటీఎంలో కొత్త ఫీచర్స్! వెంటనే తెలుసుకోండి.. లేకపోతే అంతే!
New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!
Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!
Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: