మనం తినే మాంసాహారంలో సగానికిపైగా చికెన్(కోడి మాంసం)ఉంటుంది. మరీ ప్రత్యేకించి పార్టీలు, ఫంక్షన్‌లు, జాతర్లు, పెళ్లిళ్లు , బర్త్ డేలు అకేషన్ ఏదైనా కోడి పీక తెగాల్సిందే. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చింది తినవద్దని హెచ్చరికలు, అలర్ట్ బోర్డులు, సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో కోళ్లకు ఈ బర్డ్ ఫ్లూ వచ్చిందని తెలిసి జనం భయపడిపోతున్నారు. అలాగని పార్టీలు మానుకోలేరు. ముక్క కొరకకుండా నోరు కట్టేసుకోలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో కూడా వేలాది కోళ్లు వైరస్ సోకి చనిపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కృష్ణా జిల్లా గంపలగూడెంలో కూడా బర్డ్ ఫ్లూ వైరస్ సోకింది. ఈ వైరస్ వల్ల సుమారు 10వేల కోళ్లు చనిపోయినట్లుగా తెలుస్తోంది. కోళ్లకు వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉండటంతో అధికారులు, పశుసంవర్ధకశాఖ కొద్ది రోజులు చికెన్ తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రజలను అప్రమత్తం చేసింది. నాన్ వెజ్ లవర్స్ ఎక్కువగా చికెన్‌నే ఇష్టపడటానికి అనేక కారణాలున్నాయి. త్వరగా ఉడుకుతుందని.. చాలా వెరైటీలు చేసుకోవచ్చని.. తక్కువ ధరకే వస్తుందనే ఆలోచనతో వెజిటెబుల్ కర్రీస్ కంటే చికెన్ రెగ్యులర్‌గా తినే వాళ్లు ఉన్నారు. అందుకే అధికారులు ఎక్కడిక్కడ ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ పెరగకుండా చనిపోయిన కోళ్లను గొయ్యి తీసి పూడ్చిపెట్టమని సలహా ఇస్తున్నారు.
ఇది కూడా చదవండి: మెగా డీఎస్సీపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన! ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా..
ప్రజల్ని చికెన్ తినవద్దని హెచ్చరిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. గోదావరి జిల్లాల్లో వైరస్‌తో చనిపోతున్న కోళ్లకు బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయింది. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీలలో తీసుకున్న శాంపిల్స్ పాజిటివ్‌గా వచ్చింది. దీంతో మరోసారి రెడ్ జోన్, సర్వే లెన్స్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా సుమారు 13వేల కోళ్లతో పాటు 11వేల కోడి గుడ్లను కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి పూడ్చి పెట్టేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో కానూరు అగ్రహారం మినహా మరెక్కడా బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి లేదంటూ పోస్టులు పెడుతున్నారు. హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వల్లే కోళ్లకు బర్డ్ ఫ్లూ వస్తోందని అధికారులు చెబుతున్నారు. రాజమండ్రి కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూంలో 95429 08025 నెంబర్ ఏర్పాటు చేశారు.జిల్లాలో మరెక్కడైనా కోళ్లు చనిపోతే సమాచారం ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకున్నారు కలెక్టర్ ప్రశాంతి. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలని హై అలెర్ట్ జారీ చేశారు. అయితే ప్రజలు కొన్ని రోజులు పాటు చికెన్ తినడం తగ్గించాలని పశు సంవర్ధక శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లో సుమారు రెండు లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. బర్డ్ ఫ్లూ వచ్చిన కానూరుకు 10 కిలోమీటర్ల పరిధిలో పోలీసులు 144, 133 సెక్షన్ అమలు చేస్తున్నారు. వైరస్ లక్షణాలు ఏ ఒక్కరిలో కనిపించినా వారికి యాంటీ వైరస్ మందులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని.. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తూర్పు గోదావరి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ టి.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. పెరవలి మండలం కానూరు గ్రామంలోని పౌల్ట్రీలలో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్‌గా ల్యాబ్ నిర్ధారించినందున కానూరు కేంద్రంగా 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. అయితే రేటు తగ్గిందని చికెన్ కొనాలనుకునే వారు.. బిజినెస్ పెంచుకునేందుకు చికెన్ కొంటే గుడ్లు ఫ్రీ అనే ప్రకటనలు చూసి టెంప్ట్ అయితే మొదటికే మోసం వస్తుందని అధికారులు ప్రజల్ని మరీ మరీ హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ప్రజలకు కీలక అప్డేట్.. ఏపీలో మీకు భూమి ఉందా.! వెంటనే ఇలా చెయ్యండి, లేదంటే.. రద్దవ్వగలదు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైకాపా హయాంలో మద్యం అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తి! త్వరలో నిజాలు బహిరంగం.. కొల్లు రవీంద్ర!
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం గుడ్‌న్యూస్.. ఢిల్లీలో కుమారస్వామితో పురందేశ్వరి భేటీ!
హాస్పిటల్ బెడ్ పై యాంకర్ రష్మీ.. మళ్లీ తాను డ్యాన్స్.. ఆందోళనలో అభిమానులు..
ఆయన రాజేసిన చిచ్చును ఆర్పుతున్న చంద్రబాబు! ఆ చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదు!
ఆ బాలుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. చంద్రబాబు కీలక హామీ!
ఏపీలో రెండు చోట్ల వైరస్ నిర్ధారణ! రెడ్ జోన్ ఏర్పాటు - పీపీఈ కిట్లతో కోళ్ల తనిఖీలు.!
BSNL యూజర్లకు గుడ్ న్యూస్.. మరో సరికొత్త డేటా ప్లాన్! ప్రతిరోజు 2జీబీ డేటా ఫ్రీ.!
జగన్ ఎంతకైనా తెగిస్తారు.. మంత్రులు జాగ్రత్తగా ఉండాలని చెప్పిన చంద్రబాబు!
ఉదయభాను కూతుళ్లకు మర్చిపోలేని గిఫ్ట్ పంపించిన నారా బ్రాహ్మణి.. అది ఏంటంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: