Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? Modi ji: మోదీ జీ మీ స్కిన్‌కేర్ రహస్యం ఏంటి.. హర్లీన్ ప్రశ్నకు స్నేహ్ రాణా స్మార్ట్ సమాధానం! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? Modi ji: మోదీ జీ మీ స్కిన్‌కేర్ రహస్యం ఏంటి.. హర్లీన్ ప్రశ్నకు స్నేహ్ రాణా స్మార్ట్ సమాధానం!

అర్చకుడు పై చేయిచేసుకున్న ఘటనపై ఆర్జేసీ విచారణ!! వారి ముందు కూడా రెచ్చిపోయిన వైసిపి నేత! అర్చకుని భార్య కీలక వ్యాఖ్యలు!!

2024-03-27 07:16:00

కాకినాడ: ‘నా భర్తను అంతు చూస్తానని హెచ్చరించారట.. ఈ వయసులో ఆయన్ను కొట్టారు. ఏమైనా అయితే ఎవరు సమాధానం చెబుతారు'.. కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులపై మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావు దాడి చేయడంపై దేవాదాయశాఖ అధికారులు మంగళవారం విచారణ చేపట్టినప్పుడు బాధిత అర్చకుడి భార్య చేసిన వ్యాఖ్యలివి. అర్చకుడు పెద్దసోమయాజుల వెంకట సత్యసాయిని సోమవారం చెంపపై కొట్టడంతోపాటు కాలితో తన్నిన చంద్రరావు, సర్దిచెప్పడానికి ప్రయత్నించిన మరో అర్చకుడు మద్దిరాల విజయ్కుమార్పైనా చేయిచేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనపై దేవాదాయశాఖ ఇన్ఛార్జ్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేసీ) విజయరాజు మంగళవారం ఆలయ ప్రాంగణంలో విచారణ చేపట్టారు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ సందర్భంగానూ నిందితుడు చంద్రరావు మళ్లీ దూకుడుగా ప్రవర్తించారు. అర్చకుల డిమాండ్ మేరకు క్షమాపణ చెప్పడానికి సైతం ఇబ్బంది పడ్డారు. నేనేం దాడి చేయలేదంటూ తొలుత బుకాయించినా.. అందరూ గద్దించడంతో గత్యంతరం లేక బాధిత అర్చకుడి చేతులు పట్టుకుని, అక్కడున్న అందరికీ రెండు చేతులు జోడించి క్షమించండని కోరారు. అయితే అక్కడి నుంచి బయటకు వచ్చాక 'నేనేం తప్పు చెయ్యలేదు.. క్షమాపణ చెప్పలేదు' అంటూ మీడియా ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. మొత్తానికి రాజకీయ ఒత్తిళ్లతో కేసును నీరుగార్చేందుకు పోలీసులు చూస్తుండగా, మరికొందరు అర్చకులకు సర్దిచెప్పి రాజీ కుదిర్చేందుకు విఫలయత్నాలు చేశారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

దేవాదాయశాఖ ఆర్జేసీ విజయరాజు విచారణకు వస్తున్నారని తెలియడంతో నిందితుడు చంద్రరావు అక్కడికి చేరుకున్నారు. అర్చకులను ఎందుకు కొట్టారని ఆర్జేసీ ప్రశ్నించగా.. తానేమీ కొట్టలేదని, కేవలం నెట్టానంటూ చంద్రరావు నిర్లక్ష్యంగా జవాబిచ్చారు. మిమ్మల్ని కొడితే ఊరుకుంటారా అని ఆర్జేసీ నిలదీశారు. వెంటనే చంద్రరావు గట్టిగా మాట్లాడేందుకు చూశారు. దీంతో అక్కడివారంతా కలగజేసుకొని క్షమాపణ చెబితే అంతా సర్దుకుంటుందన్నారు. నేను క్షమాపణ చెప్పనని, కాదూకూడదంటే పెట్రోలు పోసుకుంటానంటూ చంద్రరావు చొక్కా గుండీలు తీసి బెదిరించేలా ప్రవర్తించారు. దీంతో ఆర్జేసీ ‘అర్చకులు, ఉద్యోగులంటే మీకు బానిసల్లా కనబడుతున్నారా? తప్పుచేసి అలా మాట్లాడుతున్నారేంటి? వారికి అవమానం కాదా? అర్చక వ్యవస్థనే ఇబ్బంది పెడుతున్నారు. నా ముందే అలా మాట్లాడడం సరికాదు. ఉద్యోగులపై చేయిచేసుకోవడం మీ సంస్కారమా? అంత సహనం లేనప్పుడు గుడికి ఎందుకొచ్చారు? ఏమైనా ఉంటే ఈవోకు ఫిర్యాదు చెయ్యాలి కదా?' అని మండిపడ్డారు. వెంటనే డీఎస్పీకి ఫోన్ చేసి బాధ్యుణ్ని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

కాకినాడ: గుడిలో వైసీపీ నేత వీరంగం!! అర్చకుడి పై కాలితో దాడి!! నివ్వెరపోయిన భక్తులు!!

విచారణ సమయంలో పూజారి వెంకట సత్యసాయి, విజయ్ర్ కుమార్ కుటుంబసభ్యులు ఆర్జేసీ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. చర్యలు తీసుకుంటామని ఆయన వారికి భరోసా ఇచ్చారు. దేవాదాయశాఖ కమిషనర్తో బాధిత అర్చకుడు సత్యసాయిని మాట్లాడించారు. న్యాయం జరిగేలా చూస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు. అందరితో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్న అనంతరం ఆర్జేసీ విలేకర్లతో మాట్లాడారు. దేవుడి సన్నిధిలోనే అర్చకులను కొట్టడం దురదృష్టకరమన్నారు. దాడి ఘటనపై ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారని, శాఖాపరంగానూ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ఆర్జేసీని కోరారు.ఈ ఘటనలో పోలీసుల తీరుపై సందేహాలు... అరెస్ట్ చేశామని వారు చెబుతున్నారు... మరో వైపు శివాలయంలో హడావిడి చేస్తూ నిందితుడు 

ఇవి కూడా చదవండి: 

అమెరికా వెళ్లాలనుకునే వారికి వివిధ రకాల వీసాలు! వాటికి ఫీజులు! వివరాలు

దేశవాళీ విమానాలలో ప్రయాణించే సమయంలో మీతో పాటు ఏమి తీసుకెళ్లచ్చు!

చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించే... 50 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం: నారా భువనేశ్వరి

ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం!! కొలిక్కి వచ్చిన పొత్తులు!!

ఏప్రిల్‌ 1 నుంచి దేశంలోని రైల్వే స్టేషన్లలో డిజిటల్ పేమెంట్స్‌!!

Evolve Venture Capital  

18 అసెంబ్లీ స్థానాల జనసేన అభ్యర్థుల ప్రకటన!! నియోజకవర్గల అభ్యర్థులు వీరే!!

బిజెపి ఆంధ్ర తో సహా 111 అభ్యర్థుల ప్రకటన!! RRR కు మొండి చెయ్యి! 

కమ్మ నేతల ఒత్తిడితోనే  కార్పొరేషన్ ఏర్పాటు! నేడు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →