కాకినాడ: ఫాల్గుణ పౌర్ణమి, సోమవారం సందర్భంగా కాకినాడ పెద్ద శివాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అదే సమయంలో మాజీ కార్పొరేటర్, వైసీపీ నేత సిరియాల చంద్రరావు ఆలయానికి వచ్చారు. అంతరాలయంలోకి వచ్చిన ఆయన నుంచి పూజాసామగ్రి తీసుకున్న అర్చకుడు సాయి పూజలో నిమగ్నమయ్యారు. అయితే తాను తెచ్చిన పాలు శివలింగంపై సరిగ్గా పోయలేదని, అధికార పార్టీ నాయకుడికి ఇచ్చే విలువ ఇదేనా అంటూ చంద్రరావు ఆగ్రహంతో ఊగిపోయారు. సహాయ అర్చకుడు పి.వెంకటసత్యసాయి తోటి భక్తులతో పాటు ఆయనకూ ప్రసాదం ఇస్తుండగా కోపోద్రిక్తుడై ఆయన చెంపపై కొట్టారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఏం తప్పు చేశానని అర్చకుడు ప్రశ్నించడంతో నాకే ఎదురు సమాధానం చెబుతావా అంటూ అసభ్య పదజాలంతో తిట్టి, కాలితో తన్నడంతో ఆయన కింద పడ్డారు. వైసీపీ నాయకుడి కేకలు విని పక్కనే ఉపాలయంలో పూజలు చేస్తున్న మరో అర్చకుడు మద్దిరాల విజయ్ర్ కుమార్ వచ్చి అడ్డుకోబోగా ఆయన చెంపపై కూడా కొట్టారు. అసభ్యపదజాలంతో దూషించడమే కాక మీ అంతుచూస్తానంటూ వీరంగం సృష్టించారు. ఈ తతంగానికి భక్తులు నివ్వెరపోయారు. ఈవో కు ఫిర్యాదు చేసిన అర్చకులు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పల్నాడు: కారంపూడిలో సీఐ చిన్న మల్లయ్య హల్చల్!!
దేశవాళీ విమానాలలో ప్రయాణించే సమయంలో మీతో పాటు ఏమి తీసుకెళ్లచ్చు!
ఒంగోలు లోక్‌సభ సీటుపై వ్యూహం మార్చిన టీడీపీ!!
ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం!! కొలిక్కి వచ్చిన పొత్తులు!!
ఏప్రిల్ 1 నుంచి దేశంలోని రైల్వే స్టేషన్లలో డిజిటల్ పేమెంట్స్!!
18 అసెంబ్లీ స్థానాల జనసేన అభ్యర్థుల ప్రకటన!! నియోజకవర్గల అభ్యర్థులు వీరే!!
బిజెపి ఆంధ్ర తో సహా 111 అభ్యర్థుల ప్రకటన!! RRR కు మొండి చెయ్యి!
కమ్మ నేతల ఒత్తిడితోనే కార్పొరేషన్ ఏర్పాటు! నేడు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి