ఆస్ట్రేలియా: ఇటీవల క్వీన్స్ ల్యాండ్ లో ఒక్ విషాదం చోట చేసుకుంది. జలపాతం నుండి కిందపడి డాక్టర్ ఉజ్వల వేమూరు మరణించారు. శనివారం మధ్యాహ్నం డాక్టర్ వేమూరు గోల్డ్ కోస్ట్ హింటర్‌ల్యాండ్‌లోని లామింగ్టన్ నేషనల్ పార్క్‌లోని యాన్‌బాకూచీ జలపాతం వద్ద స్నేహితులతో హైకింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది. ట్రైపాడ్ని ఉపయోగించి ఫోటోలు తీయడానికి ప్రయత్నించగా ట్రైపాడ్ కింద పడిపోవడంతో దానిని తీయడానికి ప్రయత్నించినప్పుడు జారీ జలపాతం నుండి కింద పడిపోయారు. డాక్టర్ ఉజ్వల ను రక్షించడానికి ముగ్గురు వైద్యులు ప్రయత్నించారని, దురదృష్టవశాత్తు సంఘటన స్థానంలో ఆవిడ మరణించారని సమాచారం అందింది.
మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వెస్ట్రన్ ఆస్ట్రేలియా కు చెందిన డాక్టర్ ఉజ్వల గత సంవత్సరం గోల్డ్ కోస్ట్ బాండ్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ స్టడీస్ మరియు డాక్టర్ ఆఫ్ మెడిసిన్ పట్టా పొందారు. క్వీన్స్ లాండ్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ ఇన్వెస్టిగేషన్ కోసం కొంత సమయం పడుతుంది అని, క్వీన్స్ లాండ్ పోలీసులు నివేదికను సిద్ధం చేస్తారు అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఎంత మంది పిల్లలు ఉన్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు!! చంద్రబాబు నాయుడు
వివేక హత్య కేసులో అప్రూవల్ గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు!!
మంత్రి వర్గం నుంచి గుమ్మనూరును బర్త్ రఫ్ చేసిన గవర్నర్!! అది సంగతి!!
కేసీఆర్ లా నేను ప్రధాని చెవిలో గుసగుసలు చెప్పలేదు.. అంతా బహిరంగమే!! రేవంత్ రెడ్డి చిట్ చాట్
మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీనే!! పురంధేశ్వరి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి