Vadapalli Temple: వాడపల్లిలో భక్తుల జాతర... ఎండను సైతం లెక్కచేయని గోవింద నామస్మరణ! Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం! Vadapalli Temple: వాడపల్లిలో భక్తుల జాతర... ఎండను సైతం లెక్కచేయని గోవింద నామస్మరణ! Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం!

Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు!

Tirumala Laddu: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటన చేశారు. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు నినాదాలతో సభను అడ్డుకోగా, గత ప్రభుత్వ హయాంలో నిబంధనలు మార్చి కల్తీ నెయ్యి సరఫరాకు ఎలా సహకరించారో మంత్రి వివరించారు.

Published : 2026-03-05 15:33:00

తమకు కావాల్సిన వారి కోసమే నెయ్యి టెండర్ల మార్పు…

కల్తీ నెయ్యి వాస్తవమే.. ఆనాటి టీటీడీ చైర్మన్లే సాక్ష్యం…

వాస్తవాలు వినలేక వైసీపీ గందరగోళం…

Tirumala Laddu: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో తిరుమల లడ్డూ కల్తీ అంశంపై తీవ్రస్థాయిలో వాడివేడి చర్చ జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ అంశంపై ప్రకటన చేసేందుకు ప్రయత్నించగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో అడ్డుతగిలారు. మండలిలో వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. నివేదికలన్నీ వాస్తవాలను వెల్లడిస్తున్నప్పటికీ, ప్రతిపక్ష సభ్యులు అడ్డుపడటం సరికాదని మంత్రి ఈ సందర్భంగా మండిపడ్డారు. గందరగోళం మితిమీరడంతో మండలి ఛైర్మన్ సభను వాయిదా వేయాల్సి వచ్చింది.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను మంత్రి ఆనం ఈ సందర్భంగా ఎండగట్టారు. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో తిరుమలకు సంబంధించిన కీలక నివేదికలను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టారని ఆయన ఆరోపించారు. నెయ్యి కల్తీకి సంబంధించి ఆధారాలు ఉన్నా, వాటిని బయటకు రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. టెండర్ల ప్రక్రియలో నిబంధనలను తుంగలో తొక్కి, తమకు అనుకూలమైన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టేలా నిబంధనలను మార్చేశారని మంత్రి సభ దృష్టికి తీసుకువచ్చారు.

తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా జరిగిన ఈ కల్తీ వ్యవహారంపై గత టీటీడీ పాలకమండలి అధ్యక్షులైన వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి కూడా పరోక్షంగా వాస్తవాలను అంగీకరించారని మంత్రి గుర్తు చేశారు. ఆనాటి బాధ్యులే తప్పు జరిగిందని ఒప్పుకుంటుంటే, ఇప్పుడు వైసీపీ సభ్యులు మాత్రం సభలో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను తమ స్వార్థం కోసం మార్చుకున్నందువల్లే భక్తుల సెంటిమెంట్‌తో ఆడుకున్నట్లయిందని ఆయన దుయ్యబట్టారు.

వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, అందుకే తాను సభలో నివేదికను ప్రవేశపెడుతున్నానని ఆనం స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లు ల్యాబ్ నివేదికలు కూడా ధృవీకరించినప్పటికీ, వైసీపీ నేతలు మాత్రం బుకాయిస్తున్నారని విమర్శించారు. పవిత్రమైన తిరుమల ప్రసాదం విషయంలో జరిగిన అపరాధంపై చర్చ జరగకుండా అడ్డుకోవడమే ఆ పార్టీ సభ్యుల ప్రధాన అజెండాగా కనిపిస్తోందని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
 

Spotlight

Read More →