అమెరికాలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో భారతీయ యువకుడు ఫజిల్ ఖాన్ (27) దుర్మరణం చెందాడు. హార్లెమ్ ప్రాంతంలోని ఆరంతస్థుల అపార్లమెంట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ-బైక్‌ బ్యాటరీ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు అక్కడి అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

ఇంకా చదవండి:  అమెరికా నుండి టీడీపీ ప్రచారానికి వచ్చిన NRI ఆకస్మిక మృతి!!

భవనంలో చిక్కుకుపోయిన ఫజిల్ ఖాన్‌ను అగ్నిమాపక సిబ్బంది ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. న్యూఢిల్లీకి చెందిన ఫజిల్ ఖాన్ కొలంబియా జర్నలిజం కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. హెచింగర్ రిపోర్ట్ అనే విద్యాసంబంధిత వెబ్‌సైట్‌లో పనిచేసేవాడు.

ఇంకా చదవండి:  అమెరికా: అమెరికన్ ఎయిర్ లైన్స్ లో ఒక వింత సంఘటన! గాలిలో డోర్ తెరిచే ప్రయత్నం!

 భవనం మూడో ఫ్లోర్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఈ అగ్నిప్రమాదం జరిగినట్టు స్థానిక మీడియా చెబుతోంది. మంటలు మొదలైన అపార్ట్‌‌మెంట్‌లోని వారు పారిపోతూ వాటి తలుపులు తీసి పెట్టారని చెప్పింది. ఈలోపు మంటలు వ్యాపించడంతో పైఅంతస్థుల్లో వారు కిందకు దిగేందుకు మెట్లమార్గం మూసుకుపోయింది.

ఇంకా చదవండి:  వరంగల్ టికెట్ కోసం రాహుల్ ను కలిసిన ఎన్ఆర్ఐ? NRI హక్కుల కోసం!

దీంతో, కొందరు కిటికీల్లోంచి దూకే ప్రయత్నం చేశారు. ఘటనపై భారతీయ ఎంబసీ విచారం వ్యక్తం చేసింది. అతడి కుటుంబసభ్యులతో టచ్‌లో ఉన్నామని, వారికి కావాల్సిన అన్ని సహాయసహకారాలు అందిస్తామని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సైబర్ క్రైమ్ పోలీసులకు వైఎస్ షర్మిల ఫిర్యాదు!!

NRI మరియు OCI లకు వ్యత్యాసం ఏమిటి? ఆ సౌకర్యం వారికి ఉండదు!

ITR 2024: ఒకటి కంటే ఎక్కువ ఫామ్‌ - 16 ఉన్నవారికి సూచన - ఐటీ రిటర్న్‌ ఇలా ఫైల్ చేయాలి!

 జీమెయిల్ సేవలు నిలిపివేతపై క్లారిటి ఇచ్చిన గూగుల్!!

"ఐ బొమ్మ" వాడేవారికి గుడ్ న్యూస్!! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి మరీ!!

ఎమ్మెల్యేలు, మంత్రులకే అందుబాటులో లేని ముఖ్యమంత్రి! ప్రజలకు అందుబాటులో ఉంటారా?

ఇడ్లీతో జీవవైవిధ్యానికి తీరని ముప్పు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు! అదేంటో తెలుసుకోండి!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group