ఏపీలో వైసీపీ విభజించు పాలించు మంత్రం వచ్చే ఎన్నికలలో ప్రభావం చూపే అవకాశాలు కనబడడం లేదు.
2019 ఎన్నికలలో రాష్ట్రంలోని అన్ని కులాలకు కమ్మ కులాన్ని శత్రువుగా చూపి తెలుగుదేశం పార్టీ ఓటమికి, వైసిపి పార్టీ విజయానికి ఏసిన ఎత్తు ఫలించింది.
ఈ ఎన్నికలలో ఈయన పాలన వైఫల్యాలు అనుభవించిన అన్ని వర్గాల ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని ద్వేషిస్తున్నారు.
మరిన్ని ఆసక్తికర ఎక్స్ క్లూజివ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇప్పుడు రాష్ట్రంలో టిడిపి జనసేన కూటమిగా వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు.
ఈ కూటమి విచ్ఛిన్నం చేయడానికి ఈయన చేయని ప్రయత్నాలు లేవు.
ఈయన కుట్రలు కుతంత్రాలు గ్రహించిన టిడిపి జనసేన నాయకులు ఎన్ని విమర్శలు చేసిన పట్టించుకోకుండా కూటమి కట్టారు..
రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్షన్ అమలు చేయడానికి వైసిపి సన్నాహాలు! తెగించిన వారికే భూత్ ఏజెంట్లు?
కూటమి బలం పెరగడంతో నిన్న మొన్నటి వరకు పరోక్ష సహకారం అందిస్తున్న భారతీయ జనతా పార్టీ కూడా కూటమి చెంతకు చేరుతుంది.
గత ఎన్నికలలో వైసీపీ విజయానికి కృషి చేసిన వైయస్ షర్మిల నేడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష సంఘాలు చేపట్టి ఈయన పై దండయాత్రకు బయలుదేరింది.
ఈయన ప్రభుత్వంపై జరుగుతున్న ముప్పేట దాడితో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
దీనికి తోడు పలువురు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే టికెట్లను నిర్దాక్షిణ్యంగా నిరాకరించి ఈయన బయటకు గెంటేసారు.
అసంతృప్తి ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచారు.
లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా ఎన్నికలు ఆరు నెలల ముందు నుండే ఎన్నికల హడావుడి మొదలు పెట్టిన ఈయనకి అన్ని చేదు అనుభవాలే.
ఒక చెల్లి రాజకీయ పోరాటం!! మరో చెల్లి న్యాయపోరాటం!! తల్లి మౌన పోరాటం!!
టిక్కెట్లు నిరాకరించి కొందరు టిక్కెట్లు ఇచ్చిన ఓడిపోతామని మరికొందరు ఈయన ఒంటెద్దు పోకడను ఎదిరించిన మరికొందరు వైసీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు.
త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలలో కూడా జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పాలని అసమ్మతి ఎమ్మెల్యేలు కృతనిశ్చయంతో ఉన్నారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ నియోజకవర్గంలో కోట్లు దండుకున్న ఎమ్మెల్యేలను పక్క నియోజకవర్గాలకు పంపించి దండుకున్న కోట్లను ఖర్చు పెట్టించేందుకు ఈయన ఎమ్మెల్యే అభ్యర్థుల నియోజకవర్గ వర్గం మార్పులు చేస్తున్నారు.
దేశంలో నే అత్యంత ఖరీదైన ప్రభుత్వ సలహాదారులు! రాష్ట్ర ఖజానా దోపిడి! అధికారులు వారికి జీ హుజూర్
ఇది గ్రహించిన కొందరు నాయకులు ఆయన స్వర్గంలో పోటీ చేయమంటూ ప్రకటించి తప్పుకుంటున్నారు.
ఇది ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలకు అయితే పూర్తిస్థాయి ఉద్వాసన పలుకుతున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను స్థానిక ఎమ్మెల్యేల వైఫల్యాలుగా చిత్రీకరించడానికి ఈయన చేస్తున్న ప్రయత్నాలపై ఆయా ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు.
ఎన్నికల వేళ రాష్ట్రంలో అలజడలు సృష్టించడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు? అప్రమత్తంగా లేకుంటే?
నియోజకవర్గ సమస్యలపై ఐదేళ్లలో ఒక్కసారి కూడా ముఖ్యమంత్రులతో ముఖాముఖి మాట్లాడడానికి కూడా అవకాశం లేని దుస్థితి రాష్ట్రంలో ఉందని వైసిపి ఎమ్మెల్యేలే బహిరంగంగా ప్రకటిస్తున్నారు.
ఎమ్మెల్యేలకు మంత్రులకే అందుబాటులో లేని ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉంటారు.
ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఈయన వచ్చే ఎన్నికలలో ఓటమి తప్పదన్న సర్వేలతో తాడేపల్లికి పరిమితమయ్యారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి