ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వరుసపెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజా సంక్షేమంతో పాటు నిరుద్యోగ సమస్యపై కూడా కసరత్తులు చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ కీలక అప్ డేట్ బయటకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ, కర్నూలు జోన్ల పరిధిలో వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 606 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ పోస్టులకు గాను నవంబర్ 6వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను బట్టి ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఏపీఎస్‌ఆర్‌టీసీ కర్నూలు జోన్‌లో 295 అప్రెంటిస్ ఖాళీలు ఉండగా.. విజయవాడ జోన్‌లో 311 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి.
ఇంకా చదవండి: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. ఈ ఉద్యోగాలు మిస్ అవ్వకండి! రూ.60,000 నుంచి రూ.40,000 వరకు జీతాలు!
ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ జాబ్స్ ఎంపిక ప్రక్రియ ఉండనుంది. కేవలం ఐటీఐ మార్కులు, సీనియారిటీ ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి అప్రెంటిస్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఫైనల్ చేస్తారు. విజయవాడ జోన్ పరిధిలో చూస్తే కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో అదేవిధంగా కర్నూలు జోన్ పరిధిలో చూస్తే కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మోటార్ మెకానిక్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్ ట్రేడుల్లో పోస్టులు ఉన్నాయి. పూర్తి వివరాలకు APSRTC అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు.
ఇంకా చదవండి: మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!
ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!
ముంబయి నటి కేసులో కీలక నిందితుడు వైకాపా నేత సీఐడీ కస్టడీకి! విచారణలో కొత్త మలుపు!
నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!
వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: