ఆంధ్రప్రదేశ్.. పల్నాడు జిల్లాలో.. నిరుద్యోగుల కోసం ఆంధ్రప్రదేశ్ న్యూ, రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ మంచి ఆఫర్ ఇస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (NIISE) సహకారంతో ఉచిత ట్రైనింగ్ ఇవ్వబోతోంది. దీని పేరు సూర్య మిత్ర. సోలార్ రంగంలో ఈ ట్రైనింగ్ ఉంటుంది. స్థానిక ఆశా సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్‌లో ఈ ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ కోర్సులో ఉచితంగా చేరిన వారికి ఉచిత భోజనం కూడా పెడతారు. ఆశా సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్‌లో సోలార్ ఇన్‌స్టాలర్ కోర్సును ఉచితంగా చెయ్యవచ్చు. రెసిడెన్షియల్ విధానంలో 3 నెలలపాటు ఈ కోర్స్ ఉంటుంది. ఈ కోర్సును నిరుద్యోగులు పొందాలంటే.. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. అర్హులను ఎంపిక చేసేటప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఒక్కో బ్యాచ్‌కీ 30 మందిని ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాలకు చెందిన నిరుద్యోగులు ఈ ఉచిత ట్రైనింగ్ కోసం అప్లై చేసుకోవచ్చు.
ఇంకా చదవండి: అమరావతికి మరో బిగ్ న్యూస్ - కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..! ఇక ఆ ప్రాజెక్టు వేగవంతం - వారికి పండగే పండగ!
ఈ ట్రైనింగ్ పొందినవారికి సోలార్ సెక్టార్‌లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి అంటున్నారు. ట్రైనింగ్ తర్వాత పాసైన వారికి స్కిల్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ జాబ్స్ సంస్థ సర్టిఫికెట్లు ఇవ్వడమే కాదు.. ప్రముఖ సోలర్ ఇండస్ట్రీలలో ఉద్యోగాలు కూడా ఇస్తారు. ఈ కోర్స్ వల్ల కెరీర్ ఉంటుందా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఐతే.. సోలార్ రంగంలో మంచి కెరీర్ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం ప్రారంభించారు కదా.. ఈ పథకం వల్ల రూ.21 వేల డౌన్ పేమెంట్‌తో 360 యూనిట్ల విద్యుత్ పొందవచ్చు. అందువల్ల దేశవ్యాప్తంగా కోట్ల మంది సోలార్ ప్లే్ట్లను తమ ఇళ్లు, కార్యాలయాలపై ఏర్పాటు చేసుకుంటారు. అందువల్ల ఈ రంగానికి మంచి కెరీర్ ఉంటుంది అంటున్నారు. ఇంటి పైకప్పుపై 3 కిలో వాట్స్ సామర్థ్యం కలిగిన సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవచ్చు, ఈ పథకానికి తక్కువ వడ్డీకే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. నిరుద్యోగులు అన్నీ తెలుసుకొని, కోర్సులో చేరాలా వద్దా అనేదానిపై ఫైనల్ నిర్ణయం స్వయంగా తీసుకోవాలి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రూ.6 వేలకే ఐ ఫోన్, రూ.5 వేలకే ఆండ్రాయిడ్ ఫోన్.. ల్యాప్‌టాప్ రూ.15 వేలు మాత్రమే!
ముందుబాబులకు డబల్ కిక్కిచ్చే న్యూస్.. రూ.99 క్వార్టర్ వచ్చేసిందోచ్! ఒకరికి ఎన్ని ఇస్తారంటే?
ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఎవర్ని ఎంపిక చేశారు అంటే! కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు!
ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!
మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం కేసులో కోర్టు కీలక నిర్ణయం! టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా!
ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!
జగన్‌పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం! ఇదే తీరు కొనసాగిస్తే ఊరుకునేది లేదు!
రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్! దానా ఎఫెక్ట్.. 23, 24, 25 తేదీల్లో సుమారు 70 రైళ్లు క్యాన్సిల్!
ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలిండర్లు.. కావాల్సిన అర్హతలు, డాక్యుమెంట్స్ ఇవే! దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే!
మీ పేరుతో ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నాయా? భారీ జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష తప్పదు! ఎందుకో తెలుసా?
మహిళలు తస్మాస్ జాగ్రత్త.. ఈ లక్షణాలు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు! 30 నుంచి 52 సంవత్సరాల..
విజయవాడ మెట్రోని అమరావతికి అనుసంధానం చేయాలి! కేంద్ర, రాష్ట్ర మంత్రుల కీలక భేటీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: