ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదవ తరగతి మొదలకొని ఆపై చదువులు చదివి.. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలో నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గంలో ఉన్న Dr. జ్యోతిర్మయి డిగ్రీ కళాశాలలో ఈనెల 21వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్. మురళి తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో 35 ప్రముఖ కంపెనీలు పాల్గొనున్నాయి. ఈ జాబ్ మేళాలో టెక్ మహీంద్రా (TECH Mahindra), గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, ఆరంభిందో ఫార్మసి వంటి ప్రముఖ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయి.
ఇంకా చదవండి: నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.25 వేలు.. ఇలా చేయండి! ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ రాదు!
దీనికోసం పదవ తరగతి నుంచి B.Sc, MSc, ORGANIC CHEMISTRY, బీటెక్, ఎంబీఏ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులు పాల్గొనవచ్చు. 21-10-2024 వ తేదీ ఉదయం 09:00 గంటల నుండి ఈ ఉద్యోగమేళా జరగనుంది. ఇందుకు సంబంధించిన ఆదోని పట్టణంలోని డాక్టర్ జ్యోతిర్మయి డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల కరెస్పాండెంట్ మురళి తెలిపారు. ఈ ఉద్యోగం మేళాలో ఎంపికైన వారికి.. ఉద్యోగి అర్హతను బట్టి జీతం పదివేల రూపాయలు నుంచి 3.5 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకురావాలని సూచించారు. ఇక అభ్యర్థులు కేవలం ఫార్మల్ డ్రెస్ రావాల్సి ఉంటుందని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9866278735, 9100487482, 9492901222 నంబర్ ను సంప్రదించాలని తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీ షాక్.. మాజీ ఎంపీని కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు! 48 గంటల పాటు..
అర్ధరాత్రి ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియోకాల్! ఎందుకు.. ఎవరు..? తర్వాత ఏమైందంటే?
నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం! ఆ నేతల గుండెల్లో గుబులు! ప్రజాప్రతినిధులకు కీలక సూచనలు!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఇక ఆ సమస్యలకు చెక్!!
నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.25 వేలు.. ఇలా చేయండి! ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ రాదు!
మందు బాబులకు షాక్ - మద్యం ధరల పెంపు! ఒక్క బీరు ఎంతంటే..?
వరదల ప్రాంతంలో సేవ చేయడమే ఐఏఎస్ అధికారుల బాధ్యత! వెళ్లాల్సిందే" అంటు క్యాట్ కీలక నిర్ణయం!
48 గంటల్లో అత్యాచార నిందితులను అరెస్టు చేసిన పోలీసులు! ఘోర ఘటనకు కఠిన జవాబు-హోం మంత్రి!
ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్! ఆ రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకం!
ఏపీ జిల్లాలకు నూతన ఇన్చార్జి మంత్రుల ఎంపిక! ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: