ప్రస్తుతం ఇండియాలో టెలికాం సర్వీసెస్ మారుమూల ప్రాంతాలకు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి. సాధారణంగా ఫోన్లు ఉన్నవారు ఒకటి లేదా రెండు సిమ్ కార్డులు వాడటం సహజం. చాలామంది ఒకటి సొంత అవసరాలకు, మరొకటి ఆఫీస్ అవసరాలకు ఉపయోగిస్తుంటారు. అందుకు తగ్గట్టు మొబైల్ కంపెనీలు సైతం స్మార్ట్‌ఫోన్లలో రెండు సిమ్ స్లాట్‌లను అందిస్తున్నాయి. అయితే ఒక వ్యక్తి పేరుతో ఎక్కువ సిమ్ కార్డులు తీసుకోవడం చట్ట ప్రకారం నేరం. రూల్స్ ప్రకారం, ఇందుకు జరిమానా, జైలు శిక్ష కూడా విధించవచ్చు. దేశంలో ప్రస్తుతం టెలికాం చట్టం-2023 అమల్లో ఉంది. అందులో కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. టెలికాం యాక్ట్ ప్రకారం.. మొబైల్ యూజర్లు కొన్ని నిబంధనలు పాటించకపోతే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. చట్ట ప్రకారం, ఒక వ్యక్తి పేరు మీద గరిష్టంగా 9 సిమ్‌లు మాత్రమే ఉండాలి.
ఇంకా చదవండి: రిటైర్మెంట్ కోసం పెట్టుబడులు పెడుతున్నారా! ఈ సంగతి మరవద్దు!
అంతకు మించి సిమ్ కార్డులు ఉంచుకుంటే, రూ.2 లక్షల జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనలు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండవు. జమ్మూ కాశ్మీర్, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఒక వ్యక్తి 6 కంటే ఎక్కువ సిమ్‌లు వాడకూడదు. ఒకే ఆధార్ కార్డ్‌తో 9 కంటే ఎక్కువ సిమ్‌లు ఉపయోగించినా లేదా దుర్వినియోగం చేసినా.. మొదటిసారి నిబంధనలను ఉల్లంఘించినట్టు భావించి రూ.50 వేలు జరిమానా విధిస్తారు. ఒకవేళ ఇదే రిపీట్ అయితే, అప్పుడు రూ.2 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. 9 సిమ్ కార్డులు ఉంచుకుంటే జరిమానా మాత్రమే విధిస్తారు. ఒకవేళ వాటిని దుర్వినియోగం చేస్తేనే జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. మోసం చేసినట్లు నిర్ధారణ అయితేనే మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. అందుకే సిమ్ కార్డుల విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుత టెక్ యుగంలో సిమ్‌కార్డు మోసాలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. వీటిని అరికట్టడానికి టెలికాం సంస్థల నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేసింది. ఒక వ్యక్తి నేరుగా తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ కార్డులు తీసుకోకపోయినా, వారి పేరు మీద ఇతరులు సిమ్ తీసుకున్నా సరే.. అవి ఎవరి పేరు మీద ఉంటాయో, వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విజయవాడ మెట్రోని అమరావతికి అనుసంధానం చేయాలి! కేంద్ర, రాష్ట్ర మంత్రుల కీలక భేటీ!
తిరుపతిలో రాజకీయ కక్షలతో తెదేపా నేత హత్య! పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణం!
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
రోజా చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఫైర్! ఏకపక్షంగా తీర్పు ఇచ్చినా సిగ్గు రాలేదా - తమ ప్రభుత్వం వారి ఆచూకీ!
ఏపీపై ‘దానా’ తుఫాన్ దండయాత్ర.. 4 రోజులు అత్యంత భారీ వర్షాలు! ఆ జిల్లాల వారికి అలర్ట్!
సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన! ఇళ్లు కట్టుకోవాలనుకునే వారికి బంపర్ ఆఫర్.!
దోచుకుని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ! జగన్ పై షర్మిల ఫైర్ - రాజీ చర్చల ప్రచారం వేళ..!
మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! దీపావళి కానుక అదరహో! ఆ వివరాలు మీ కోసం!!
వైసీపీకి షాక్.. మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు అరెస్ట్! ఎందుకో తెలుసా?
రూ.1 కట్టక్కర్లేదు.. ఏపీలో వీళ్లందరికీ ఉచితంగానే కరెంట్! ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!
ఉత్తరాంధ్రకు భారీ వర్షాల సూచన! మత్స్యకారులకు సముద్రంలో వెళ్లవద్దని హెచ్చరిక!
పాకిస్థాన్ యువతిని ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న బీజేపీ కార్పొరేటర్ కొడుకు! పెళ్లి కూతురు తరపువారు!
ఏపీలో మద్యం బాబుల సందడి! ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో!
ఆధార్ కార్డ్ ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! జిల్లాలలో 5 నుంచి 15 ఏళ్ల వయసు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: