ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులకు కొలువుల కోత భయాలు వెంటాడుతున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో మొదలైన లేఆఫ్స్ సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతోంది. తొలుత మాంద్యం భయాలతో ఉద్యోగులను ఎడాపెడా పీకేసిన సంస్థలు.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ (TikTok) తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.
ఇంకా చదవండి: ఏ వయస్సు వారు ఎన్ని గంటలు నిద్రపోవాలి? నిపుణులు ఏం చెప్తున్నారంటే!
మలేషియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తన కంపెనీలో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సుమారుగా 700 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు లేఆఫ్‌లకు సంబంధించిన ఇ-మెయిల్స్ అందినట్లు తెలుస్తోంది. అయితే, టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ (ByteDance) మాత్రం ఈ లేఆఫ్స్ ప్రభావం 500 కంటే తక్కువ మంది ఉద్యోగులపైనే చూపిందని స్పష్టం చేసింది.
ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ ఏడాది మేలో కూడా టిక్‌టాక్ ప్రపంచవ్యాప్తంగా 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ముఖ్యంగా కంటెంట్, మార్కెటింగ్ విభాగాల్లో ఈ తొలగింపులు జరిగాయి. త్వరలోనే మరో రౌండ్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జరుగనున్నట్లు సమాచారం. ఇక టిక్‌టాక్ మాతృసంస్థ అయిన బైట్ డ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ నగరాల్లో 1,10,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
డిప్యూటి సీఎం పవన్ ప్రత్యేక శ్రద్ధ.. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ప్రజలు! ఎప్పటికప్పుడు అధికారులతో!
వెంటనే ఏపీకి వెళ్లిపోండి - 11 మంది తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ లకు కేంద్రం ఆదేశం! కారణం ఏమిటి!
ఏపీలో బయటపడ్డ మరో నగ్న వీడియో! ఈసారి ఆ పార్టీ నేత బుక్కైయ్యడు! అసలు ఏమి జరిగింది!
విజయవాడలో రైతు బజార్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి! వినియోగదారులతో మాట్లాడి వివరాలు!
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా! అనుచిత వ్యాఖ్యలపై కోర్టు నోటీసులు!
రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం... ఏపీ, తెలంగాణకు ఎంతంటే! అత్యధికంగా యూపీకి!
ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్! గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్లు విడుదల!
చిలకలూరిపేటలో ఐసీఐసీఐ బ్యాంకు భారీ కుంభకోణం! సీఐడీ విచారణలో సంచలన రహస్యాలు!
వైసీపీ పతనానికి కర్త, కర్మ, క్రియ అన్నీ జగనే! కలలో కూడా రెడ్ బుక్కే వస్తుంది!
రెండు రోజుల్లో 2 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు పుట్ట గొడుగు! మన్యం అడవుల్లో వింత ప్రకృతి దృశ్యం!
ఏపీలో కొత్త మద్యం దుకాణాలకు వెల్లువెత్తిన దరఖాస్తులు! ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: