గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేసేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకులు కృషి చేస్తుంటాయి. వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు అనేక అంశాల్లో శిక్షణ అందిస్తుంటాయి. ఈ క్రమంలోనే చంద్రగిరి యూనియన్ బ్యాంక్ సైతం మహిళలకు బంపరాఫర్ ఇచ్చింది. చంద్రగిరిలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ మహిళలకు గుడ్ న్యూస్ వినిపించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు బ్యూటీపార్లర్ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 15 నుంచి 30 రోజుల పాటు ఈ ఉచిత ట్రైనింగ్ కొనసాగనుంది. ఈ మేరకు చంద్రగిరి యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇంకా చదవండి: ఏ వయస్సు వారు ఎన్ని గంటలు నిద్రపోవాలి? నిపుణులు ఏం చెప్తున్నారంటే!
అయితే ఈ ఉచిత శిక్షణ కోసం తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. తెల్ల రేషన్‌కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని గ్రామీణ యువతులు, మహిళలకు ఈ అవకాశం కల్పించారు. ఈ రెండు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 19 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువతులు, మహిళలు ఇందుకు అర్హులు. అలాగే కనీసం పదో తరగతి చదువుకుని ఉండాలని అధికారులు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు వెంటనే సంప్రదించాలని సూచించారు. అలాగే ట్రైనింగ్ సమయంలో వీరికి ఉచిత భోజనం సౌకర్యం కల్పిస్తారు. అలాగే వచ్చీపోయేందుకు ఒక ఛార్జీ డబ్బులు సైతం ఇస్తారని ప్రకటనలో తెలిపారు. నెలరోజుల ట్రైనింగ్ పూర్తైన తర్వాత బ్యూటీపార్లర్ కోర్సులో సర్టిఫికేట్ కూడా ఇవ్వనున్నారు.
ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరోవైపు బ్యూటీపార్లర్ ఉచిత శిక్షణ కోసం ఆసక్తి ఉన్న వారు.. ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలతో పాటుగా.. పాస్‌పోర్టు ఫోటోలతో పేర్లు నమోదు చేసుకోవాలని యూనియన్ బ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ప్రకటనలో తెలిపింది. ఇక ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొంది. ట్రైనింగ్ పూర్తైన తర్వాత అందించే సర్టిఫికేట్ ద్వారా స్వయంగా ఉపాధి పొందవచ్చని సూచించింది. అలాగే పదిమందికీ ఉపాధి కల్పించే అవకాశం లభిస్తుందని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. మహిళలకు బ్యూటీపార్లర్, కుట్టు అల్లికలతో పాటుగా యువకులకు కారు డ్రైవింగ్, ఫోటోగ్రఫీ, వీడియో గ్రఫీ వంటి కోర్సులలో ఉచితంగా శిక్షణ అందిస్తూ గ్రామీణ యువత స్వయం ఉపాధి పొందేలా యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కృషిచేస్తోంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
డిప్యూటి సీఎం పవన్ ప్రత్యేక శ్రద్ధ.. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ప్రజలు! ఎప్పటికప్పుడు అధికారులతో!
వెంటనే ఏపీకి వెళ్లిపోండి - 11 మంది తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ లకు కేంద్రం ఆదేశం! కారణం ఏమిటి!
ఏపీలో బయటపడ్డ మరో నగ్న వీడియో! ఈసారి ఆ పార్టీ నేత బుక్కైయ్యడు! అసలు ఏమి జరిగింది!
విజయవాడలో రైతు బజార్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి! వినియోగదారులతో మాట్లాడి వివరాలు!
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా! అనుచిత వ్యాఖ్యలపై కోర్టు నోటీసులు!
రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం... ఏపీ, తెలంగాణకు ఎంతంటే! అత్యధికంగా యూపీకి!
ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్! గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్లు విడుదల!
చిలకలూరిపేటలో ఐసీఐసీఐ బ్యాంకు భారీ కుంభకోణం! సీఐడీ విచారణలో సంచలన రహస్యాలు!
వైసీపీ పతనానికి కర్త, కర్మ, క్రియ అన్నీ జగనే! కలలో కూడా రెడ్ బుక్కే వస్తుంది!
రెండు రోజుల్లో 2 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు పుట్ట గొడుగు! మన్యం అడవుల్లో వింత ప్రకృతి దృశ్యం!
ఏపీలో కొత్త మద్యం దుకాణాలకు వెల్లువెత్తిన దరఖాస్తులు! ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: