పండగ సీజన్ వేళ ఆఫర్ల ఫెస్టివల్‌కు ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తెరలేపింది. ఏటా నిర్వహించే 'బిగ్ బిలియన్ డేస్' సేల్స్ తేదీలను తాజాగా ప్రకటించింది. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ మొదలు కానుందని వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 26 నుంచే సేల్ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేసింది.
ఇంకా చదవండి: ఛత్తీస్ గఢ్ లో దారుణం.. చేతబడి అనుమానంతో ఐదుగురి హత్య! అసలు విషయం తెలిస్తే షాక్!
దీంతో ఈసారి సేల్స్‌లో కస్టమర్లు భారీ ఆఫర్స్ పొందే అవకాశం ఉంది. త్వరలోనే ఆ ఆఫర్ల వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, దుస్తులు, ఏవైనా గృహోపకరణాలను షాపింగ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నవారికి 'బిగ్ బిలియన్ డేస్' సేల్స్ బాగా ఉపయోగపడతాయనే చెప్పచ్చు.
ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2024 సందర్భంగా అన్ని విభాగాల్లో భారీ తగ్గింపులు ఉంటాయని సమాచారం. స్మార్ట్ టీవీలతో పాటు గృహోపకరణాలపై ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ 80 శాతం వరకు తగ్గింపును అందించే అవకాశం ఉంది. ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, గేమింగ్ పరికాలు, గాడ్జెట్ పరికరాలపై 50 శాతం నుంచి 80 శాతం వరకు తగ్గింపు లభించనుంది. రిఫ్రిజిరేటర్లు, 4కే స్మార్ట్ టీవీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై 75 శాతం భారీ తగ్గింపు లభించే అవకాశం ఉంది. ఇక స్మార్ట్‌ఫోన్‌లలో నథింగ్, రియల్‌మీ, ఇన్ఫినిక్స్ వంటి ప్రముఖ బ్రాండ్‌లు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో గణనీయమైన తగ్గింపులతో రానున్నాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కొన్ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మోడళ్లపై పరిమిత కాల వ్యవధిలో బహుళ బ్యాంక్ ఆఫర్‌లు ఉంటాయి. ఒకవేళ మీరు ఐఫోన్ వంటి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉంటే.. మీకు ఈ ప్లాట్‌ఫారమ్‌లో కొన్ని అదనపు ఆఫర్‌లను పొందే అవకాశం ఉంది. మరోవైపు ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?
వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం! చెక్కు అందజేసిన సిఈఓ!
ప్రత్యక్ష ప్రసార డిమాండ్‌తో బెంగాల్ డాక్టర్ల నిరసన ఉధృతి! సర్కార్‌కు వైద్యుల గట్టి దెబ్బ!
ప్రధాని నివాసంలో పుంగనూరు లేక దూడ! ఆసక్తికర కామెంట్ చేసిన నారా లోకేశ్! నా స్వస్థలానికి చెందిన...
ఇప్పటికైనా మారకపోతే బెంగళూరు ప్యాలెస్ దాకా తరిమికొడతారు! జగన్‌పై మంత్రి ఫైర్!
ఇలా చేస్తే రూ.499కే వంటగ్యాస్ సిలిండర్.. ఇది గమనించారా? రహస్యంగా మూడో కంటికి తెలియకుండా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: