ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు జరిపేవారికి పర్మినెంట్ అకౌంట్ నంబర్(PAN) గుర్తింపు కార్డు తప్పనిసరి ప్రూఫ్‌గా మారిపోయింది. వ్యక్తులు, సంస్థలకు ఆదాయ పన్ను శాఖ పాన్ కార్డు జారీ చేస్తుంటుంది. ట్రాన్సాక్షన్లను ట్రాక్ చేయడానికి, ఇన్‌కం ట్యాక్స్ ఫైల్ చేసేందుకు పాన్ కార్డ్ ఉపయోగపడుతుంది. అయితే, రెగ్యులర్ పద్ధతిలో ఫిజికల్ పాన్ కార్డు పొందాలంటే కాస్త సమయం పడుతుంది. డిపార్ట్‌మెంట్ కార్డును ప్రింట్ చేసి పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇలా కాకుండా తక్కువ సమయంలోనే ఫ్రీగా ఎలక్ట్రానిక్ పాన్(e-PAN) తీసుకోవచ్చు. ఆధార్ నంబర్ సహాయంతో ఆన్‌లైన్‌లో పాన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మొబైల్ నంబర్‌తో లింక్ అయిన ఆధార్ నంబర్ సబ్మిట్ చేస్తే, ఇ-కేవైసీ వివరాలను విశ్లేషించి పది డిజిట్ల ఆల్ఫాన్యూమరిక్ నంబర్ జనరేట్ అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత, వెంటనే పీడీఎఫ్ రూపంలో ఇ-పాన్ డాక్యుమెంట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇ-పాన్‌కి సైతం ఆదాయపు పన్ను శాఖ చట్టబద్ధతను కల్పిస్తోంది. పాన్ కార్డు అవసరమయ్యే అన్ని చోట్ల ఇ-పాన్ చెల్లుతుంది. ఆధార్ కార్డు ఉండి, పాన్ కార్డు లేని వారు ఇ-పాన్ కోసం ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఇ-పాన్ కోసం ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం.
ఇంకా చదవండి: మహిళలకు గుడ్ న్యూస్.. పది గ్రాములు రూ. 20 వేలే! కేంద్రం నిర్ణయం! ఎందుకో తెలుసా?
-ముందుగా ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal/ లోకి వెళ్లాలి.
- ఇ ఫైలింగ్ పోర్టల్‌లోని హోం పేజీలోకి వెళ్లి ఇన్‌స్టంట్ ఇ-పాన్(Instant e-PAN) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఇ-పాన్ పేజీలోకి వెళ్లాక Get New e-PAN పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు 12 అంకెల ఆధార్ నంబర్‌ని ఎంటర్ చేసి చెక్‌బాక్స్‌పై క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయాలి.
- తర్వాత కంటిన్యూ బటన్‌పై క్లిక్ చేయగానే ఓటీపీ పేజీలోకి వెళ్తుంది. ఇందులో చూపించిన టర్మ్స్ అగ్రీ చేసి మళ్లీ కంటిన్యూ బటన్‌పై క్లిక్ చేయాలి.
- ఆధార్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌కి 6 అంకెల వన్ టైమ్ పాస్‌వర్డ్(OTP) వస్తుంది. ఈ ఓటీపీని అందులో ఎంటర్ చేసి అక్కడ ఉన్న చెక్‌బాక్స్ వ్యాలిడేట్ చేయాలి.
- అందులో చూపించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి పూర్తిగా చదువుకుని చెక్‌బాక్స్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్లిక్ కంటిన్యూ బటన్‌పై క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయినట్లు ఓ మెసేజ్ చూపిస్తుంది.
- ఇందులో అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ ఉంటుంది. ఈ ఐడీని రాసిపెట్టుకుంటే తర్వాత ఇ-పాన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి పనికొస్తుంది. దీంతో పాటు అప్లికేషన్ పూర్తయినట్లు ఫోన్‌కి మెసేజ్ సైతం వస్తుంది.
ఆన్‌లైన్‌లో ఇ-పాన్ అప్లై చేయడానికి కచ్చితంగా ఆధార్‌కార్డుతో మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. దీంతో పాటు ఆ ఆధార్ నంబర్‌పై ఇదివరకు పాన్ కార్డు లింక్ అయి ఉండకూడదు. ఇవి రెండు తప్పనిసరిగా పాటించాలి. లేదంటే, అప్లికేషన్ ప్రాసెస్ ముందుకు కదలదు. దరఖాస్తు ప్రక్రియలో ఆధార్ నంబర్ ఎంటర్ చేశాక ఒకవేళ ఆధార్ కార్డు పాన్‌కి లింక్ అయి ఉంటే, ఆధార్ కార్డ్ పాన్ కార్డుతో లింక్ అయి ఉందనే మెసేజ్ చూపిస్తుంది. మొబైల్ నంబర్‌తో ఆధార్ లింక్ చేయకపోయినా సంబంధిత మెసేజ్‌ని డిస్‌ప్లే చేస్తుంది.
ఇంకా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొనసాగుతున్న వైసీపీ నేతల రాజీనామాల పర్వం! కారణం?
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!
బుడమేరుకు పెరుగుతున్న వరద! విజయవాడ వీధుల్లోకి నీళ్లు!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం! టీడీపీ నుండి ఎమ్మెల్యే సస్పెన్షన్!
ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు బిగ్ షాక్! చుక్కలు చూపించిన అధికారులు!
ఏలూరులో వైసీపీకి మరో బిగ్ షాక్! పార్టీకి సీనియర్ నేత గుడ్ బై!
వరద ప్రవాహం తగ్గడంతో... కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజి మరమ్మత్తుల పనులు!
వైసీపీ కి షాక్.. వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్! ఎందుకో తెలుసా?
వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేదు అనుభవం! దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చిన వరద బాధితులు! ఎందుకంటే..!
ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!
ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!
గొప్ప మనసు చాటుకున్న భువనేశ్వరి! తెలుగు రాష్ట్రాలకు రూ.2కోట్ల విరాళం ప్రకటించిన!
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించని పవన్ కల్యాణ్.. కారణమెంటో చెప్పిన డిప్యూటీ సీఎం!
ఏపీలో ప్రకృతి ప్రకోపం.. వరద బాధితుల కోటి విరాళం అందించిన టీడీపీ ఎంపీ!
తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం ప్రకటించిన హీరో మహేశ్ బాబు! ఎంతో తెలుసా?
ప్రియురాలిని కలవడానికి బురఖాలో వెళ్లిన యువకుడు.. చివరికి జరిగింది ఇదీ! సోషల్ మీడియాలో వైరల్!
నారా లోకేశ్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు! 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా!
విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద! ఈరోజు 8 వేల క్యూసెక్కుల ప్రవాహం!
ప్రభాస్, అల్లు అర్జున్ ఉదారత.. భారీ విరాళాలు ప్రకటించిన స్టార్స్! ఎంతో తెలుసా?
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు సహా నలుగురు భారతీయులు మృతి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: