2019లో విడాకులు తీసుకున్న ధనవంతుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన ప్రేయసి లారెన్ శాంచెజ్‌ను డిసెంబర్ 28వ తేదీన వివాహం చేసుకోనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కొలరాడోలోని ఆస్పెన్‌లో అతికొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జెఫ్ బెజోస్-లారెన్ శాంచెజ్ ఒక్కటి కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు మీడియా తెలిపింది. ఇక వీరిద్దరూ వింటర్ వండర్‌ల్యాండ్ వెడ్డింగ్ పద్దతిలో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. ఇక 60 ఏళ్ల జెఫ్ బెజోస్ తన రెండో పెళ్లికి భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. జెఫ్ బెజోస్-లారెన్ శాంచెజ్ వివాహానికి ఏకంగా రూ. 5096 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు సమాచారం. ఇక గతేడాది మే నెలలోనే జెఫ్ బెజోస్-లారెన్ శాంచెజ్ జంటకు నిశ్చితార్థం జరిగింది. ఫ్రాన్స్‌లో వెకేషన్‌కు వెళ్లిన సందర్భంలో ఓ లగ్జరీ నౌకలో 2.5 మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.21 కోట్ల విలువైన గులాబీ రంగు వజ్రాల ఉంగరం ఇచ్చి జెఫ్ బెజోస్ లారెన్ శాంచెజ్‌కు ప్రపోజ్ చేసినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి.
ఇంకా చదవండి: కువైట్ లోని లేబర్ క్యాంపును సందర్శించిన ప్రధాని మోడీ! ఇండియన్ కమ్యూనిటి ఘన స్వాగతం!
ఇక 54 ఏళ్ల లారెన్ శాంచెజ్ గతంలో జర్నలిస్ట్‌గా పనిచేశారు. ది వ్యూ, కేటీ టీవీ, ఫాక్స్ 11 వంటి ప్రముఖ ఇంటర్నేషనల్ ఛానెల్స్‌లో రిపోర్టర్‌గానూ, న్యూస్ ప్రజెంటర్‌గా లారెన్ శాంచెజ్ విధులు నిర్వర్తించారు. ఇక లారెన్ శాంచెజ్‌కు గతంలో పాట్రిక్ వైట్‌సెల్ అనే వ్యక్తితో పెళ్లి జరగ్గా.. ఆ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మాజీ ఎన్‌ఎఫ్‌ఎల్ ఆటగాడు టోనీ గోంజలెజ్‌తోనూ ఆమె ఒక కుమారుడికి జన్మనిచ్చారు. అయితే జెఫ్ బెజోస్‌కు ఇది రెండో పెళ్లి కాగా.. లారెన్ శాంచెజ్‌కు మాత్రం మూడో వివాహం. జెఫ్ బెజోస్ తన మొదటి భార్య మెకంజీ స్కాట్‌కు 2019లో విడాకులు ఇచ్చారు. జెఫ్ బెజోస్-మెకంజీ స్కాట్ జంటకు మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు. ఇక 2018 నుంచే జెఫ్ బెజోస్, లారెన్ శాంచెజ్ డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. జెఫ్ బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్‌తో ఉన్న 25 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ 2019లో విడాకులు తీసుకునే వరకు ఆ విషయం బయటికి రాలేదు. ప్రస్తుతం జెఫ్ బెజోస్ ఆస్తి విలువ 251 బిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ.21.32 లక్షల కోట్లు.
ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
దేశ రాజధాని ఢిల్లీలో TDP సభ్యత్వ నమోదు కార్యక్రమం! సభ్యత్వంతో సరికొత్త రికార్డు!
డబ్బులు వడ్డీకి ఇస్తే జైలు శిక్షే మరియు జరిమానా! ప్రభుత్వం దిమ్మతిరిగే రూల్స్..
అల్లు అర్జున్ అరెస్ట్ ఎందుకు.. రేవంత్ రెడ్డి పై పురంధేశ్వరి షాకింగ్ కామెంట్స్!
ఏపీలో తగ్గిన మద్యం ధరలు! కొత్త రేట్లు చూస్తే.. బాటిల్ దింపరు! ప్రస్తుతం కొత్త మద్యం పాలసీ!
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడి! విద్యార్థి సంఘాల ఆందోళన!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు.. జీతం రూ.50 వేలు!Don'tMiss
వైసీపీలోకి కీలక నేత ఎంట్రీ! జగన్‌తో భేటీ - దీని కారణంగానే..
అమెరికా పౌరసత్వాల్లో పెరిగిన భారతీయులు! ఈ ఏడాది ఎంతమంది సిటిజెష్‌షిప్ పొందారో తెలిస్తే షాక్!
అల్లుఅర్జున్ కు ఊహించని షాక్! నేను చూస్తూ ఊరుకోను - సినీ ఇండస్ట్రీకి రేవంత్ హెచ్చరిక!
ఎస్‌బీఐలో 13735 ఖాళీలు! హైదరాబాద్ స ర్కిల్‌లో 342 పోస్టులు!
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!
కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు, అప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: