By - Ch. Raja Sekhar
మెయిడ్ మార్కెట్ – యజమాని దాడులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం..!!
గల్ఫ్ లో భారత పనిమనిషి అరబ్బు ఇంట్లో పని చేస్తూ అక్కడ ఇబ్బందులకో మరి వేరే ఏ కారణాలో కాని ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంది. తన కడుపులో తానే పొడుచుకుని అపస్మారక పరిస్థితిల్లోకి వెళ్ళిపోయింది. ఆమెను వెంటనే అక్కడ హాస్పిటల్ కి తరలించారు. ఆమె ఒక అరబ్ స్పాన్సర్స్ ఇంట్లో పని చేస్తోంది. ఇంటి యజమానురాలు ఆమెను రక్తపు మడుగులో ఉండడం చూసి వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళారు. ఆమెపై ఆత్మహత్య కేసు నమోదు చేశారు, ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగు పడ్డాక ఆమెని ప్రశ్నిస్తే, ఇండియాలో ఉన్న ఆమె భర్త వేరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని తన పిల్లలను పట్టించుకోవట్లేదని, తను కష్టపడి సంపాదిస్తున్న సంపాదన మొత్తాన్ని ఆయనకే పంపుతున్నానని, ఆ డబ్బులన్నీ కూడా తాగుడుకి, అలాగే సంబంధం పెట్టుకున్న స్త్రీకి ఖర్చు చేస్తున్నాడని తనకి ఇక వేరే దిక్కు లేక ఆత్మహత్య కు పాల్పడ్డాను అని తెలిపింది.
మరోవైపు ఒక ఫిలిపీయన్ పని మనిషి తాను పని చేస్తున్న ఇంటి 2వ ఫ్లోర్ నుండి కిందకి దూకి, ఆ ఇంటి యజమాని నుండి పారిపోవాలని ప్రయత్నించింది. తన యజమాని తనపై చేసే దాడులు తట్టుకోలేక తప్పించుకుందామని అలా దూకానని ఆమె కథనం. కొన్ని నెలల ట్రీట్మెంట్ తర్వాత బతికి బయటపడింది.
ఇంకా చదవండి: ముందుబాబులకు డబల్ కిక్కిచ్చే న్యూస్.. రూ.99 క్వార్టర్ వచ్చేసిందోచ్! ఒకరికి ఎన్ని ఇస్తారంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
"ఏ చరిత్ర చూసిన ఏమున్నది గర్వ కారణం నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం” అన్నట్లు ఒక్క భారతదేశం అనే కాదు, దేశ విదేశాలనుండి గల్ఫ్ దేశాలకి వచ్చే పనిమనుషుల కష్టాలు చిన్నవి కాదు. బ్రతుకు తెరువు కోసం సంపాదన కోసం ఉన్న ఊరిని, కన్నవాళ్ళని వదులుని తమ ఉనికి మర్చిపోయి పని చేసే ఈ పనిమనుషుల గోడు ఎవరికి తెలుస్తుంది. ఎంతోమంది ఇలా పారిపోయి, మానసికంగా పాడయిపోయి, ఎన్నో ఎన్నెన్నో కష్టాలు పడుతూ బ్రతుకుని వెళ్ళదీస్తున్నారు ఈ గల్ఫ్ దేశాలలో.
ఆరోగ్య చిట్కా: గల్ఫ్ దేశాలలో మనం తినే సన్న బియ్యం దొరకవు. ఒకవేళ దొరికినా చాలా ఖరీదుగా ఉంటాయి. ఎక్కడ చూసినా బాస్మతి బియ్యం లేదా మంచి క్వాలిటీ పొడుగు బియ్యం దొరుకుతాయి. బాస్మతి బియ్యం దొరికినాయి కదా అని కంట్రోల్ లేకుండా ఎక్కువ అన్నం తిన్నారంటే మీరు ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకోవటమే అవుతుంది. వీలైనంత తక్కువ రైసు తినండి. దీర్ఘకాలంలో మీకు షుగర్ వ్యాధి రాకుండా కాపాడుకోండి.
డ్రైవర్ చిట్కాలు: గల్ఫ్ దేశాలలో డ్రైవింగ్ చేస్తున్నవారు తప్పనిసరిగా అక్కడ రూల్స్ ని పాటించాల్సిందే. కారు డ్రైవింగ్ తప్పనిసరిగా నిర్దేశించిన వేగం లోనే వెళ్ళండి. ప్రతి దేశంలో స్పీడ్ కెమెరాలు ఉన్నాయి. జరిమానాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
గల్ఫ్ మెయిడ్ మార్కెట్ ముందు భాగాలు:
1. గల్ఫ్ లో పని మనుషుల కోసం జరిగే దంధా! ఖర్చులు ఎంత అవుతాయి! ఏజెంట్ల చేతిలో ఎందుకు మోసపోతున్నారు!
9. గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఎవర్ని ఎంపిక చేశారు అంటే! కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు!
ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!
మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం కేసులో కోర్టు కీలక నిర్ణయం! టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా!
ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!
జగన్‌పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం! ఇదే తీరు కొనసాగిస్తే ఊరుకునేది లేదు!
రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్! దానా ఎఫెక్ట్.. 23, 24, 25 తేదీల్లో సుమారు 70 రైళ్లు క్యాన్సిల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: