రాజకీయం, సినిమాలు, వ్యాపారం, కుటుంబం ఏదైనా సరే వారసత్వం అనేది మిథ్య అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. నారా లోకేశ్ వారసత్వంపై దావోస్ లో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తుంటాయని... వాటిని అందిపుచ్చుకుంటేనే రాణించగలరని చెప్పారు. జీవనోపాధి కోసం తాను రాజకీయాలపై ఆధారపడలేదని... అందుకే 33 ఏళ్ల క్రితమే కుటుంబ వ్యాపారాలను ప్రారంభించానని చంద్రబాబు చెప్పారు. బిజినెస్ అయితే లోకేశ్ కు తేలికైన పని అని... కానీ, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు.
ఇంకా చదవండి: ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఆయన నియామకానికి రంగం సిద్ధం! సీనియారిటీ జాబితాలో రెండో స్థానం!
లోకేశ్ రాజకీయాల్లోకి రావడంలో కుటుంబ వారసత్వం లేదని... ప్రజా సేవలో ఆయన తృప్తిగా ఉన్నారని చెప్పారు. వనరులను లూటీ చేసి డబ్బులు సంపాదించడం దేశాభివృద్ధికి విఘాతం కలిగిస్తుందని చంద్రబాబు అన్నారు. జగన్ మళ్లీ సీఎం అయితే ఏమిటనే ప్రశ్నకు బదులుగా... ఎవరైనే సరే మోసం చేసి ఒకసారి మాత్రమే అధికారంలోకి రాగలరని, ప్రతిసారి రాలేరని చెప్పారు. రాజకీయాలైనా, వ్యక్తిగత జీవితమైనా విలువలు ఉండాలని చెప్పారు. గుజరాత్ లో బీజేపీ వరుసగా ఐదోసారి అధికారంలోకి వచ్చిందని... దీంతో అక్కడ అభివృద్ధి, సంక్షేమం పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చంద్రబాబు అన్నారు. మోదీ మూడోసారి ప్రధాని అయ్యారని... నాలుగోసారి కూడా అవుతారని చెప్పారు. కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అదానీ కాంట్రాక్టులపై ప్రశ్నకు సమాధానంగా... ఆ వ్యవహారం అమెరికా కోర్టులో పెండింగ్ లో ఉందని... కచ్చితమైన సమాచారం వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇంకా చదవండి: బిగ్ అలర్ట్.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అలా చేయకుంటే పెన్షన్ రద్దు?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఓరి దేవుడా.. వీడు అసలు మనిషేనా? ఘోరం... భార్యను చంపి కుక్కర్ లో ఉడికించాడు!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! విశాఖలో డిజైన్ కేంద్రం.. గూగుల్‌తో ఇప్పటికే పలు ఒప్పందాలు!
ఘోర ప్రమాదం... ప్రయాణికుల మీదకు దూసుకెళ్లిన రైలు!
డిప్యూటీ సీఎం పదవిపై లోకేశ్ తొలి స్పందన! ఆ ఛానల్ ప్రతినిధి ప్రశ్న..
తెలుగు సినీ నిర్మాతల ఇళ్లు, ఆఫీసుల్లో హై టెన్షన్! రెండో రోజు ఐటీ సోదాలు!
జనసేనానికి భారీ శుభవార్త చెప్పిన ఎన్నికల సంఘం! పార్టీ శ్రేణుల్లో పండగ వాతావరణం!
నేషనల్ హైవేలపై దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం! తాజాగా రూ.5,417 కోట్లతో... ఈ రూట్ లోనే!
నల్గొండలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే పై దాడి! తమపై ఆయుధాలతో..
రూ.10 వేల పెట్టుబడితో 17 లక్షల ఆదాయం! పోస్ట్ ఆఫీస్ బ్యాంక్‌లో అదిపోయే స్కీమ్!
ఓరి దేవుడా.. తస్మా జాగ్రత్త.. మందులోకి మంచింగ్ గా.. ఈ ఐదు పదార్థాలు తింటే మీ పని అంతే!
ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు!
వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..
ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: