దావోస్, జనవరి 22:- సర్వర్‌ల కోసం సొంత చిప్‌లను రూపొందిస్తున్న గూగుల్ విశాఖపట్నంలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌ను కోరారు. గూగుల్ క్లౌడ్ తన సర్వర్ సప్లై చైన్ అనుసంధానించేలా తయారీ యూనిట్‌ను ఏపీలో నెలకొల్పాలని థామస్ కురియన్‌కు ముఖ్యమంత్రి కోరారు. సర్వర్ నిర్వహణ సేవల విషయంలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం పూర్తిగా వుంటుందని థామస్ కురియన్‌కు ముఖ్యమంత్రి తెలిపారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో భాగంగా దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. మూడో రోజు పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకట్టుకునేందుకు ప్రముఖ సంస్థల అధిపతులతో చర్చలు జరిపారు.
గూగుల్‌తో ఇప్పటికే పలు ఒప్పందాలు:
క్లౌడ్ ప్రొవైడర్‌లో ప్రపంచంలో మూడో అతి పెద్ద సంస్థ అయిన గూగుల్ క్లౌడ్.. తన ప్లాట్‌ఫామ్ కింద ఇప్పటికే భారత్‌లోని ఢిల్లీ, ముంబైలో రెండు క్లౌడ్ రీజియన్లు ఏర్పాటు చేసింది. ఇటీవల విశాఖపట్నంలో తమ ‘డేటా సిటీ’ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ ఎంవోయూ కుదుర్చుకుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని అభివృద్ధి చేయడానికి, రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పెంపొందించేందకు ఏపీతో ఒప్పందం చేసుకుంది.
ఇంకా చదవండి: ఘోర ప్రమాదం... ప్రయాణికుల మీదకు దూసుకెళ్లిన రైలు!
పెట్రోనాస్ ప్రెసిడెంట్‌తో ముఖ్యమంత్రి చర్చలు..
పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎగ్జీక్యూటివ్ ఆఫీసర్ ముహమ్మద్ తౌఫిక్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. ‘పెట్రోనాస్’ మలేషియాకు చెందిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ. ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, గ్రీన్ మాలిక్యులస్‌కు సంబంధించి భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. 2030 కల్లా ఏడాదికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి కాకినాడ ప్లాంటులో రూ.13,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. పెట్రోకెమికల్ హబ్‌గా అవతరిస్తున్న మూలపేటలోనూ, అలాగే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌లోనూ పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముహమ్మద్ తౌఫిక్‌ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
ఇంకా చదవండి: ట్రంప్ నిర్ణయాలతో భారతీయులపై ప్రభావమెంత? మొదటి దెబ్బ పడినట్టే! అమెరికా వెళ్లాలనుకునే వారికి, అక్కడ ఉన్న వారికి షాక్!
పెప్సీకో అధిపతులతో సమావేశం..
పెప్సీకో ఇంటర్నేషన్ బెవరేజస్ సీఈవో యూజీన్ విల్లెంసెన్, పెప్సీకో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కెహోతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. పెప్సీకో ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫుడ్ బెవరేజెస్. ఇప్పటికే ఏపీలోని శ్రీసిటీలో బాటిలింగ్ ప్లాంట్ నిర్వహిస్తున్న పెప్సికో బెవరేజెస్... విశాఖపట్నాన్ని గ్లోబల్ డెలివరీ సెంటర్‌గా చేసుకుని పెప్సీకో డిజిటల్ హబ్‌ను ఏర్పాటు చేయవచ్చని ముఖ్యమంత్రి సూచించారు. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్‌ను విశాఖకు విస్తరించాల్సిందిగా కోరారు. కుర్‌కురే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుతో పాటు పెప్సీకో తమ సప్లై చైన్ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఏపీసీఎన్‌ఎఫ్‌తో భాగస్వామ్యం కావాలని సూచించారు. బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయంలో ప్రతినిధి హమద్ అల్ మహ్మీద్, ముంతాలకత్ సీఈవో అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫాతోనూ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పారిశ్రామికాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీలను వివరించిన ముఖ్యమంత్రి....స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజనెస్ కోసం ఎపికి రావాలని వారిని ఆహ్వానించారు.
ఇంకా చదవండి: బిగ్ అలర్ట్.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అలా చేయకుంటే పెన్షన్ రద్దు?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
డిప్యూటీ సీఎం పదవిపై లోకేశ్ తొలి స్పందన! ఆ ఛానల్ ప్రతినిధి ప్రశ్న..
తెలుగు సినీ నిర్మాతల ఇళ్లు, ఆఫీసుల్లో హై టెన్షన్! రెండో రోజు ఐటీ సోదాలు!
జనసేనానికి భారీ శుభవార్త చెప్పిన ఎన్నికల సంఘం! పార్టీ శ్రేణుల్లో పండగ వాతావరణం!
నేషనల్ హైవేలపై దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం! తాజాగా రూ.5,417 కోట్లతో... ఈ రూట్ లోనే!
నల్గొండలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే పై దాడి! తమపై ఆయుధాలతో..
రూ.10 వేల పెట్టుబడితో 17 లక్షల ఆదాయం! పోస్ట్ ఆఫీస్ బ్యాంక్‌లో అదిపోయే స్కీమ్!
ఓరి దేవుడా.. తస్మా జాగ్రత్త.. మందులోకి మంచింగ్ గా.. ఈ ఐదు పదార్థాలు తింటే మీ పని అంతే!
ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు!
వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..
ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: