విజయవాడ - అమరావతి మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి.. మెట్రో స్టేషన్ల స్థలాలను ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్.. ఖరారు చేసింది. ఫేజ్-1 కింద మొత్తం 38.4 కిలోమీటర్ల మేర మెట్రో అందుబాటులోకి రానుంది. కారిడార్- 1ఏలో గన్నవరం నుంచి పీఎన్బీఎస్ ఉంటుంది. దీంట్లో 22 స్టేషన్లు ఉండనున్నాయి. కారిడార్-2 బీలో పెనమలూరు నుంచి పీఎన్బీఎస్ వరకు 11 స్టేషన్లు ఉండనున్నాయి. కారిడార్- 1ఏ గన్నవరం నుండి పీఎన్బీఎస్ వరకు ఉంటుంది. దీంట్లో గన్నవరం బస్టాండ్, యోగాశ్రమం, విమానాశ్రయం, కేసరపల్లె, వేల్పూరు, గూడవలి, శ్రీ చైతన్య కళాశాల, నిడమనూరు రైల్వేస్టేషన్, ఎనికెపాడు, ఎంబిటి సెంటర్, ప్రసాదంపాడు, రామవరప్పాడు రింగ్, గుణదల, పడవలరేవు, సీతారామపురం ఎస్.సి. బీసెంట్ రోడ్, రైల్వే స్టేషన్ తూర్పు, రైల్వే స్టేషన్ సౌత్ స్టేషన్లు ఉండనున్నాయి. కారిడార్-2 బీ పీఎన్బీఎస్ నుండి పెనమలూరు వరకు ఉంటుంది. దీంట్లో పీఎన్బీఎస్, విక్టోరియా జూబ్లీ మ్యూజియం, మున్సిపల్ స్టేడియం, టిక్కిల్ రోడ్, బెంజ్ సర్కిల్, ఆటో నగర్, అశోక్ నగర్, కృష్ణ నగర్, కానూరు సెంటర్, తాడిగడప, పోరంకితో సహా 11 స్టేషన్లు ఉన్నాయి.
ఇంకా చదవండి: నేడు (6/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి దశ డీపీఆర్ను ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. మొదటి దశలో.. 1ఏ కారిడార్లో భాగంగా.. గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు నిర్మాణం చేపట్టనున్నారు. 1బీలో భాగంగా.. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం దూరం 38.40 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి అంచనా వ్యయం రూ.11,009 కోట్లు ఉంది. ఇందులో భూసేకరణ ఖర్చు రూ.1,152 కోట్లు. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. రెండో దశలో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి.. రిజర్వాయర్ స్టేషన్ వరకు నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం దూరం 27.75 కిలోమీటర్లు ఉంటుంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ను ట్రాక్లో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2024-25 వార్షిక బడ్జెట్లో ఆ సంస్థకు రూ.50 కోట్లు కేటాయించింది. భూ సేకరణ పనులకు ఈ నిధులు వినియోగించనున్నారు. కూటమి ప్రభుత్వం విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టులకు అయ్యే మొత్తం ఖర్చును దశల వారీగా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ రాసి మెట్రో ప్రాజెక్టులకు సహకరించాలని కోరారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో కొత్త వైరస్ కేసులు.. వ్యాధి లక్షణాలు 3 నుంచి 10 రోజుల్లోగా..! ఆరోగ్యశాఖ స్పందన ఇదే..
అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే..
పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్!
ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్!
ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు..
ఏపీలో ప్రధాని మోదీ పర్యటన! ఎప్పుడు? ఎందుకు..?
పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్..
లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా..
ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి!
ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!
ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు..
తల్లికి వందనం పథకం అమలుకు డేట్ ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: