ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలోని కాలేజీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సాధించేందుకు నిధుల విడుదల గురించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు, మొదట కొన్ని నిధులు విడుదల చేయాలని సూచించారు. ఫీజు కట్టలేదని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి సర్టిఫికెట్ల విషయంలో ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. కేబినెట్ భేటీలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై చర్చ జరిగింది. విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని మంత్రి లోకేష్ కోరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, కాలేజీ యాజమాన్యాలకు భరోసా ఇచ్చేలా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి నిధులు ముందుగా విడుదల చేయాలని నిర్ణయించారు. కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని, అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన సూచించారు.
ఇంకా చదవండి: హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ ఫుల్ టైమ్ ఉద్యోగ అవకాశాలు! కావలసిన అర్హతలు ఇవే!
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, పథకాలను ఒకొక్కటిగా అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వము నేరుగా కాలేజీ యజమాన్యాలకు చెల్లించాలనీ, తద్వారా విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు లేకుండా చూడాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ పథకం ద్వారా కాలేజీలకు నిధులు దశలవారీగా చెల్లించబడతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టొద్దని, ఈ అంశాన్ని వెంటనే కాలేజీ యాజమాన్యాలకు చెప్పాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో కాలేజీలకు భారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెరిగాయి అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. కొన్ని నిధుల విడుదల చేయడం వల్ల ఊరట లభిస్తుందని ఆయన తెలిపారు. ఇందులో ముఖ్యంగా, కేంద్రం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు నిధులను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుందని, రాష్ట్రం ఇచ్చే నిధులు కూడా అలాగే నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి పోతాయని నిర్ణయించారు. అంతే కాకుండా, కాలేజీలకు కొంత బకాయి విడుదల చేస్తున్నాం, కాబట్టి యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని ప్రభుత్వ అధికారులకు సూచనలు ఇచ్చారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా..
ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి!
ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!
ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు..
తల్లికి వందనం పథకం అమలుకు డేట్ ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!
ఇకపై తెలుగులోనూ ఉత్తర్వులు ఇవ్వాలి! ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!
HDFC నుంచి మరో 2 కొత్త పథకాలు! రూ.100 ఉంటే చాలు! పూర్తి వివరాలు ఇవే!
రూ.10 వేలలోపు ధరలో... మంచి శాంసంగ్ ఫోన్లు ఇవే! వాటి ధరలు మారే అవకాశం.. Don't Miss!
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! మరో కొత్త రైల్వే లైను ప్రకటించిన కేంద్రం!
ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: