ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో పలువురికి వాట్సాప్ సందేశాలు పంపుతూ మోసం చేసేందుకు ప్రయత్నించిన మాజీ రంజీ క్రికెటర్ బుడుమూరి నాగరాజుపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ క్రికెటర్ రికీ భుయ్‌కి స్పాన్సర్ చేయాలని, క్రికెట్ కిట్లు కొనుగోలు చేయడానికి డబ్బులు పంపించాలంటూ ఏపీ సీఎం పీఏ పేరుతో నాగరాజు పలువురికి మెసేజ్‌లు పంపించాడు. రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ డిపార్టుమెంట్‌లో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్న పెండ్యాల శ్రీనివాసరావు పేరుతో నాగరాజు ఈ మోసాలకు పాల్పడే ప్రయత్నం చేశాడు.
ఇంకా చదవండి: ఏపీకి తీపికబురు చెప్పిన కేంద్రం.. పవన్ శాఖకు బిగ్ బూస్ట్! ఇక వారికి పండగే పండగ - రెండు విడతలుగా నిధులు విడుదల!
వాట్సాప్‌లో చంద్రబాబుతో శ్రీనివాసరావు కలిసి ఉన్న ఫొటోను పంపిస్తూ... తాను సీఎం పర్సనల్ సెక్రటరీని అని నమ్మించే ప్రయత్నం చేశాడు. తన పేరుతో ఎవరో పలు కార్పోరేట్ కంపెనీలకు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్న విషయాన్ని గుర్తించిన శ్రీనివాసరావు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జులై 3న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నాగరాజు మరోసారి అదే తరహా మోసానికి పాల్పడ్డాడు. డబ్బులు పంపించాలంటూ ఇటీవల కూడా సందేశాలు పంపించాడు. ఈ విషయం తన దృష్టికి రావడంతో శ్రీనివాసరావు సైబర్ క్రైమ్ పోలీసులను మరోసారి ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇంకా చదవండి: అమెరికాలో మరో ఘోర ప్రమాదం! ఊహించని విధంగా తెలుగు విద్యార్ధి మృతి! ఇలా కూడా జరుగుతుందా అనే రీతిలో! మరో ఇద్దరు క్షేమం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!
నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
ఏపీఎస్డీఎంఏ: రెండ్రోజుల పాటు వర్షాలు! బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో..
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో మలుపు! ఏ18గా మైత్రీ మూవీస్... నిందితుల జాబితా ఇదే!
రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా? ఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు! కీలక ఆదేశాలు - అది ఏమిటంటే!
విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!
ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!
బీసీ సంక్షేమానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు! ప్రత్యేక రక్షణ చట్టంపై...!
బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: