సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 21 అంశాలపై చర్చ జరిగిందని మంత్రి పార్థసారథి తెలిపారు. గత ప్రభుత్వం జలీవన్ మిషన్ పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. రూ.26,804 కోట్ల ప్రతిపాదనలు పంపి రూ.4వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వివరించారు. చిన్న రాష్ట్రాలు కూడా రూ. లక్ష కోట్లకు పనులు చేసుకున్నాయన్నారు. గతంలో చేపట్టకుండా నిలిచిపోయిన పనులు పునఃపరిశీలిస్తామన్నారు. పరిశీలన తర్వాత ప్రాజెక్టులు తిరిగి చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. మంత్రి వర్గ నిర్ణయాలను మంత్రి మీడియాకు వెల్లడించారు.
మంత్రివర్గ నిర్ణయాలివే..
• అమరావతి నిర్మాణం కోసం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిర్ణయం
• హడ్కో ద్వారా రూ.11వేల కోట్లు రుణం తీసుకునేందుకు కేబినెట్ అనుమతి
• జర్మనీకి చెందిన కేఎఫ్ డబ్ల్యూ ద్వారా రూ.5 వేల కోట్ల రుణానికి ఆమోదం
ఇంకా చదవండి: కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం! కొత్త ఇళ్ల మంజూరుకు సర్వే ప్రారంభం! ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!
• 45 పనులకు రూ.33వేల కోట్ల నిధులు ఖర్చు చేసేందుకు సీఆర్డీఏకు అనుమతి
• బుడమేరు, పది జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్కు ఆమోదం
• ధాన్యం కొనుగోలు కోసం మార్కెఫెడ్ ద్వారా రూ.వెయ్యి కోట్ల రుణానికి ఆమోదం
• పోలవరం ఎడమ కాల్వ రీటెండర్కు అనుమతి
• పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు ఆమోదం
• క్లీన్ ఎనర్జీ కోసం ఎన్టీపీసీ ద్వారా పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు
• రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులతో విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటు
• రాష్ట్రంలోని 475 జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు ఆమోదం. 1.41 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..
రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్‌లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!
నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!
ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!
టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..
ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో..
వైసీపీకి బిగ్ షాక్! ఆళ్ల నాని సైకిలెక్కేస్తున్నారా ? రేపు ఉదయం 11 గంటలకి..
H-1B వీసాలపై అమెరికా కీలక ప్రకటన.. తాజా అప్‌డేట్ ఇదే! భారతీయ టెక్ రంగానికి గొడ్డలిపెట్టు!
4 రోజుల పాటు కొనసాగనున్న భువనేశ్వరి పర్యటన! ఎక్కడ అంటే!
ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టు గుడ్ న్యూస్! రూల్ 3(ఎ) సవరణకు గ్రీన్ సిగ్నల్!
మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు... మోహన్ బాబు భార్య సంచలన లేఖ!
ఏపీ ప్రజల కోసం మరో పథకం తెచ్చిన చంద్రబాబు! వారందరికీ ఫ్రీగా రూ.2వేల.. వైసీపీ సర్కార్ వాటిలో!
ఆ కేసులో పేర్ని నానికి బిగ్ షాక్! ఎట్టకేలకు లుక్ అవుట్ నోటీసు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: