పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతల తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయిన సందర్భం, నామినేటెడ్ పదవులు పందేరం జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పార్టీ నేతల తీరుపై ఆయన దృష్టి సారించారు. ఇందులో భాగంగా జిల్లాల నుంచి రిపోర్టులు తెప్పించుకున్నారు. ఈ రిపోర్టులో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతల పని తీరు బాగోలేదని తేలింది. దీంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారిపై కూడా కొన్నిచోట్ల వ్యతిరేకత ఉన్నట్లు చంద్రబాబు దృష్టికి వచ్చింది.
ఇంకా చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్ వేళ.. స్పందించిన పలువురు సినీ ప్రముఖులు! ఏమంటున్నారంటే..?
ఇంకా చదవండి: టాలీవుడ్‌కు షాక్.. పరారీలో మంచు మోహన్‌బాబు! గాలిస్తున్న పోలీసులు..!
దీంతో పార్టీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో అత్యవసర సమావేశం నిర్వహించారు. నామినేటెడ్ పదవులపై పార్టీ నేతలకు పలు సూచన, సలహాలు చేశారు. పలువురు నేతలు, ఎమ్మెల్యేల పని తీరుపై మండిపడ్డారు. కొందరు పదవులు వచ్చేశాయని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారని, మరికొందరు ఎమ్మెల్యేలు అయ్యామని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వల్లే పదవులు వచ్చాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని హెచ్చరించారు. కష్టపడనిదే ఏదీ రాదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. పదవులు తప్ప ఊరికే పార్టీలో ఉన్నామంటే కుదరదని తేల్చి చెప్పారు. పని తీరు ఆధారంగా గుర్తింపు ఉంటుందన్నారు. ప్రజలకు, పార్టీకి సేవ చేయకుండా పదవులు ఇమ్మనడం సరికాదని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!
వైకాపా మాజీ ఎంపీ హౌస్ అరెస్ట్ సంచలనం! పులివెందులలో పోలీసుల ప్రత్యేక నిఘా!
18 వేల మందికి అమెరికా డీపోర్టేషన్! ఆందోళనలో భారతీయులు! టాప్ కేటగిరి తెలుగు వారే!
మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు! అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం!
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇక వారికే పెన్షన్లు - అలా కట్ చేయండి! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: