ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం తన మేనల్లుడు, మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్‌కు అభినందనలు తెలిపారు. హీరోగా సినీరంగ ప్రవేశం చేసి పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా గురువారం సాయి దుర్గా తేజ్ మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుని పవన్ కల్యాణ్ పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సాయి దుర్గా తేజ్‌కు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నటన పట్ల ఎంతో తపనతో తేజ్ ఎదుగుతూ వస్తున్నాడని పవన్ పేర్కొన్నారు. నటుడిగా సినీ రంగంలోకి వచ్చిన నాటి నుంచి సహా నటులు, సాంకేతిక నిపుణులతో సాయి తేజ్ ఎంత గౌరవ మర్యాదలతో ఉన్నాడో ఇప్పటికీ అలానే ఉన్నాడన్నారు.
ఇంకా చదవండి: "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?
తను ప్రమాదంలో చిక్కుకొన్నప్పుడు సైతం ఎంతో ఆత్మవిశ్వాసం చూపించాడని అన్నారు. ఆ క్రమం నుంచి తనకు ఎదురైన పరిస్థితి మరెవరికీ రాకూడదనే ఉద్దేశంతో రహదారి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఎలాంటి జాగ్రత్తలు వహించాలో చైతన్య పరుస్తున్నాడని అన్నారు. సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడేవారు, పోస్టులు పెట్టడంపై వేగంగా స్పందించిన తీరు ఆయనలోని సామాజిక బాధ్యతను తెలియజేస్తుందన్నారు. అలానే ఇటీవల విజయవాడలో భారీ వర్షాలు, వరద ముంపు సంభవించిన తరుణంలో తన వంతు బాధ్యతగా స్పందించాడన్నారు. సినీ హీరోగా మరిన్ని విజయాలు సాధించాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!
ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?
నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!
వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!
ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!
మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: