అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని, మైక్ ఇస్తే కట్ చేస్తారని, ఎమ్మెల్యేలాగా రెండు నిమిషాలు మాట్లాడేందుకు అసెంబ్లీకి వెళ్లడం ఎందుకని ఎమ్మెల్యే జగన్ అన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై బీఏసీ మీటింగ్‌లో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు..
ఎమ్మెలందరికీ శిక్షణ తరగతులు: జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఈ నెల 22వరకూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతారయని, అసెంబ్లీ సమావేశాలు సీరియస్‌గా తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. శనివారం కూడా సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. బిల్లులు, చర్చలకు అనుగుణంగా కొన్ని రోజులు రెండు పూటలా అసెంబ్లీ నిర్వహిస్తామని అన్నారు. 8 బిల్లులతో పాటు ప్రభుత్వ పాలసీలకు ఆమోదం తెలపాలని నిర్ణయించినట్లు స్పీకర్ తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు బడ్జెట్‌పై అవగాహన పెంచుకోవాలని 39 శాఖలకు సంబంధించిన ప్రతిపాదనల గురించి తెలుసుకోవాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. ఎమ్మెల్యేలు బడ్జెట్ పై అధ్యయనం చేసి సభలో చర్చించాలన్నారు. దీనిపై రేపు బడ్జెట్‌పై అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెలందరికీ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు తమ వెంట అనుచరుల్నిఅసెంబ్లీకి తీసుకుని రావటం మానుకోవాలని హితవు పలికారు.
ఇంకా చదవండి: అసెంబ్లీకి వెళ్ళకుంటే శాసనసభా పక్షం మొత్తం రాజీనామా చేయాలి! వైసీపీపై వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్!
ఫిర్యాదులు ఎందుకొచ్చాయి?: అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక్క ఎమ్మెల్యే అయినా భోజనం బాగుందని అంటున్నారా అంటూ అధికారులపై మండిపడ్డారు. సభ్యులకు వేరుగా, ఇతరులకు వేరుగా భోజనం పెట్టారా అంటూ నిలదీశారు. అందరికీ ఒకేలా భోజనం పెట్టామన్న అధికారులు తెలిపారు. ఒకేలా భోజనం పెడితే తానెందుకు నిలదీస్తానన్న సభాపతి ప్రశ్నించారు. తనకు ఫిర్యాదులు ఎందుకొచ్చాయో సమాధానం చెప్పాలని తేల్చి చెప్పారు. అసెంబ్లీ అంటే తమాషా అనుకుంటున్నారా అంటూ అధికారులు, కాంట్రాక్టర్‌పై సభాపతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..
అసెంబ్లీకి హాజరవ్వాలి: ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై బాధ్యతాయుతమైన చర్చ జరపడం సభ్యుల బాధ్యత అని అన్నారు. ఎమ్మెల్యేలు విధిగా అసెంబ్లీకి హాజరై సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. చీఫ్ విప్, విప్‌లను రేపు ఖరారు చేస్తామని చంద్రబాబు తెలిపారు..
ఓ రోజు రుషికొండ పర్యటన చేపట్టాలి: తాను స్పీకర్‌గా ఉన్న సమయంలో సభలో చంద్రబాబు హుందాతనం చూశానని జనసేన పక్షనేత నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. కనీసం 15 రోజులైనా అసెంబ్లీ జరగాలని బీజేపీ పక్ష నేత విష్ణు కుమార్ రాజు ఆకాంక్షించారు. ప్రజాధనం దుర్వినియోగంతో కట్టిన రుషికొండపై చర్చ జరగాలని అన్నారు. ఎమ్మెల్యేలంతా ఓ రోజు ఋషికొండ పర్యటన చేపట్టాలని విష్ణుకుమార్ రాజు కోరారు..
ఇంకా చదవండి: మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!
ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!
ముంబయి నటి కేసులో కీలక నిందితుడు వైకాపా నేత సీఐడీ కస్టడీకి! విచారణలో కొత్త మలుపు!
నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!
వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: