వైసీపీ కార్యకర్తలనూ, సోషల్ మీడియా ప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ అనడంతో.. దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఐఏఎస్ లకు వార్నింగ్ ఇస్తే.. అలాంటి వారిపై సుమోటోగా కేసులు పెడతామని అన్నారు. అధికారులపై చిన్న గాటు పడినా ఊరుకునే ప్రసక్తే లేదన్న పవన్ కళ్యాణ్.. తమది మంచి ప్రభుత్వం అన్నారు. మెతక ప్రభుత్వం మాత్రం కాదు అన్నారు. అంతేకాదు.. కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ షర్మిల కోరితే భద్రత కల్పిస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్.. తమది మంచి ప్రభుత్వమనీ, మెతక ప్రభుత్వం కాదని.. తరచూ అంటున్నారు. తద్వారా తప్పులు చేసేవారిని చూస్తూ ఊరుకునేది లేదనే సంకేతాలు ఇస్తున్నారు. ఇలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలవుతున్నా.. ఇప్పటికీ ఆ ప్రభుత్వం తాను అనుకున్నది చెయ్యలేకపోతోంది. ప్రతి రోజూ వైపీసీతో పోరాటమే సరిపోతోంది. ఇలా వైసీపీ, ఒక రకంగా కూటమి నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఐతే.. కేసులు, అరెస్టులు మొదలయ్యాయి కాబట్టి.. మున్ముందు తప్పుడు పనులు చేసే వారికి షాకులు తప్పవు అనుకోవచ్చు. ఐతే.. కొంతమంది టీడీపీలో కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు. అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. యాక్షన్ అనేది రెండువైపులా ఉండాలని కోరుతున్నారు.
ఇంకా చదవండి: మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!
ముంబయి నటి కేసులో కీలక నిందితుడు వైకాపా నేత సీఐడీ కస్టడీకి! విచారణలో కొత్త మలుపు!
నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!
వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: