రాష్ట్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ పథకాన్ని తెలుపు రంగు రేషన్ కార్డు ఉన్న నిరుపేద కుటుంబాలకు మాత్రమే వర్తింప చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఉచిత గ్యాస్ పొందాలనుకుంటే, వినియోగదారులు తమ వద్ద గ్యాస్ కనెక్షన్, ఆధార్ కార్డు, తెలుపు రంగు రేషన్ కార్డు ఉండాలి. ఈ కార్డులు గ్యాస్ కనెక్షన్లతో అనుసంధానమై ఉండాలి. అలా ఉంటేనే ఉచిత గ్యాస్ పథకం అమలు అవుతుంది. అలాగే, వినియోగదారుని బ్యాంక్ అకౌంట్ కూడా గ్యాస్ కనెక్షన్‌కు అనుసంధానమై ఉండాలి. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం ఈ నెల 29 నుంచి ప్రారంభమవుతుంది. జిల్లా అధికారులు అర్హులైన కుటుంబాలకు దీపావళి సందర్భంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్పీజీ కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నవారు ఈ పథకానికి అర్హత సాధిస్తారు. ఈ నెల 31న సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అదే రోజున జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కూడా ఈ పథకాన్ని జిల్లా స్థాయిలో ప్రారంభించనున్నారు. ప్రతి ఇంటికి మొదటి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇంకా చదవండి: ఏపీ సర్కార్ కీలక ప్రకటన! భవన నిర్మాణాలు, లేఅవుట్ అప్రూవల్ సేవలకు బ్రేక్! అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో!
గ్యాస్ బుకింగ్ చేసుకున్న వెంటనే, లబ్ధిదారుల ఫోన్ నంబరుకు ఒక ఎస్ఎమ్‌ఎస్ వస్తుంది. బుక్ చేసిన 24 గంటల్లో పట్టణ ప్రాంతాల్లో, 48 గంటల్లో గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లో, డీబీటీ విధానం ద్వారా లబ్ధిదారుల ఖాతాలో నేరుగా రాయితీ సొమ్ము జమ అవుతుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు, విధి విధానాలపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో 5.80 లక్షల గ్యాస్ కనెక్షన్లు, 5.43 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీరిలో అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయబడుతుంది. ఈ పథకం ద్వారా జిల్లాలో ఐదు లక్షల మంది లబ్ధి పొందుతారని అంచనా. ప్రతి ఏడాదికి మూడు సిలిండర్లు ప్రభుత్వం అందజేస్తుంది. మూడు ఉచిత సిలిండర్లలో మొదటి సిలిండర్ మార్చి 31 లోపు, రెండోది జూలై 31 లోపు, మూడోది నవంబర్ 30 లోపు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. ఈ పథకాన్ని అమలు చేయడానికి ఏడాదిని మూడు బ్లాక్ పీరియడ్లుగా విభజించారు: మొదటి బ్లాక్ ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు, రెండో బ్లాక్ ఆగస్టు 1 నుండి నవంబర్ 30 వరకు, మూడో బ్లాక్ డిసెంబర్ 1 నుండి మార్చి 31 వరకు ఉంటుంది. ఈ పథకం అమల్లో లబ్ధిదారులకు ఏమైనా సమస్యలు ఎదురైతే, టోల్ ఫ్రీ నంబర్ 1967 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అని జిల్లా పౌరసరఫరాల అధికారులు శంకర్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో 47 వివిధ కంపెనీల గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి, అందులో 5.80 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెలుపు రంగు రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఈ పథకాన్ని వర్తింప చేయడానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెక్కెర కార్డు ఉన్నవారికి మరియు ఆదాయపు పన్ను చెల్లించేవారికి ఈ పథకం వర్తించదు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు! అర్హులు ఎవరు అంటే!
ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!
దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!
యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏపీ! అమెరికాలో మంత్రి లోకేశ్ - డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని!
లక్షా రూ.70 వేల ల్యాప్‌టాప్ జస్ట్ రూ.30 వేలకే.. ఆఫర్‌లో కొనడం మంచిదేనా? ఎక్కడి నుంచి తెస్తారు?
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! నవంబర్ 4 వరకు ఆ సేవలు బంద్!
బాబాయ్ కామెంట్స్ పై షర్మిల కంతటడి! మోచేతి నీళ్లు తాగే వ్యక్తి - జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు!
15 కేసులతో రౌడీషీటర్ వైకాపా సానుభూతిపరుడు కస్టడీకి! గుంటూరు న్యాయస్థానం కీలక ఆదేశం!
చంద్రబాబు చేసిన ఈ వంట అంటే భువనేశ్వరికి చాలా ఇష్టం అంట! ఇది అస్సలు ఊహించి ఉండరు!
ఛీ ఛీ వీడు మనిషి కాదు! పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కిరాతకం! ఇలా కూడా ఉంటారా.. అసలు ఏం జరిగింది!
రెండో పెళ్లి గురించి సమంత షాకింగ్ కామెంట్స్! ప్రస్తుతం తనకు మరో వ్యక్తి!
కొత్త బైక్ తీసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్! దీపావళికి బంపర్ ఆఫర్.. కేవలం రూ.6,999లకే బైక్.!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్ లో కొత్త చట్టం - టీచర్లకోసం సంచలన నిర్ణయం!
సినీ నటి పక్కన కూర్చోవడానికి కేటీఆర్ నిరాకరణ... ఎందుకంటే? ఇది మరీ ఓవర్గా ఉంది అంటూ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: