కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇవాళ విశాఖ పర్యటనకు వచ్చారు. విశాఖ విమానాశ్రయంలో ఆయన రెండు కొత్త విమాన సర్వీసులు ప్రారంభించారు. ఈ రెండు విమాన సర్వీసుల్లో ఒకటి ఎయిరిండియా కాగా, మరొకటి ఇండిగో. ఈ రెండు విమానాలు విశాఖ-విజయవాడ మధ్య తిరగనున్నాయి. దీనిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, విశాఖ-విజయవాడ మధ్య ఫ్లయిట్ కనెక్టివిటీ పెంచాలని చాలా విజ్ఞప్తులు వచ్చాయని అన్నారు. ప్రజల కోరిక మేరకు రెండు నగరాల మధ్య రెండు విమాన సర్వీసుల ప్రారంభించామని తెలిపారు. ఒకేసారి రెండు నగరాల మధ్య రెండు విమానాలు ప్రారంభించడం ఇదే తొలిసారి అని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. 

ఇంకా చదవండిదీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!

ఆయా రూట్లలో ఎక్కువ సీట్లు అందుబాటులోకి వస్తే టికెట్ ధరలు తగ్గుతాయని వివరించారు. విశాఖ-విజయవాడ మధ్య విమాన టికెట్ బహుశా రూ.3 వేలు ఉండొచ్చని పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఈ క్రమంలో విశాఖ-గోవా మధ్య కూడా విమాన సర్వీసులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, భవిష్యత్తులో విశాఖ నుంచి అత్యధిక కనెక్టివిటీలు వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. భోగాపురంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఎయిర్ సర్వీస్ యూనివర్సిటీని భోగాపురంలో నెలకొల్పాలని నిర్ణయించామని వెల్లడించారు. ఎయిర్ కార్గోపైనా ప్రత్యేక దృష్టి  పెట్టామని, ఆ దిశగా ఇప్పటికే కొన్ని సమావేశాలు జరిగాయని అన్నారు. త్వరలో విశాఖ నుంచి అంతర్జాతీయ ఎయిర్ కార్గో సేవలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఏపీలో విమానయాన అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు.

నూతన విమాన సర్వీసుల టైమింగ్స్..

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్... ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నంలో ప్రారంభమై, 10.35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 7.55 గంటలకు బయలుదేరి, 9 గంటలకు విశాఖ చేరుతుంది. అలాగే ఇండిగో సర్వీసు రోజూ రాత్రి 7.15 గంటలకు విజయవాడలో బయలుదేరి 8.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 8.45 గంటలకు విశాఖలో బయలుదేరి, 9.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

 ఇంకా చదవండి: బంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: ఆ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు - వారికి పండగే!

యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏపీ! అమెరికాలో మంత్రి లోకేశ్ - డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని!

లక్షా రూ.70 వేల ల్యాప్‌టాప్ జస్ట్ రూ.30 వేలకే.. ఆఫర్‌లో కొనడం మంచిదేనా? ఎక్కడి నుంచి తెస్తారు?

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! నవంబర్ 4 వరకు ఆ సేవలు బంద్!

బాబాయ్ కామెంట్స్ పై షర్మిల కంతటడి! మోచేతి నీళ్లు తాగే వ్యక్తి - జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు!

15 కేసులతో రౌడీషీటర్ వైకాపా సానుభూతిపరుడు కస్టడీకి! గుంటూరు న్యాయస్థానం కీలక ఆదేశం!

చంద్రబాబు చేసిన ఈ వంట అంటే భువనేశ్వరికి చాలా ఇష్టం అంట! ఇది అస్సలు ఊహించి ఉండరు!

ఛీ ఛీ వీడు మనిషి కాదు! పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కిరాతకం! ఇలా కూడా ఉంటారా.. అసలు ఏం జరిగింది!

రెండో పెళ్లి గురించి స‌మంత షాకింగ్ కామెంట్స్‌! ప్ర‌స్తుతం త‌న‌కు మ‌రో వ్య‌క్తి!

కొత్త బైక్ తీసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్! దీపావళికి బంపర్ ఆఫర్.. కేవలం రూ.6,999లకే బైక్.!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్ లో కొత్త చట్టం - టీచర్లకోసం సంచలన నిర్ణయం!

సినీ నటి పక్కన కూర్చోవడానికి కేటీఆర్ నిరాకరణ... ఎందుకంటే? ఇది మరీ ఓవర్గా ఉంది అంటూ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group