రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువల్లో అత్యవసర పనులను చేపట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల సీఈ, ఎస్ఈలతో విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువల అత్యవసర పనుల నిర్వహణకు సీఎం చంద్రబాబు విడుదల చేసిన రూ.284 కోట్లతో.. ఆ పనులను చేపట్టాలని అధికారులకు సూచించారు. జగన్ పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ గేట్లు, షట్టర్లు, రోప్స్ వంటివి నిర్వహణ సరిగా లేక నిర్వీర్యంగా మారాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్ట్లల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన 2,323 పనులకు వెంటనే టెండర్లు పిలిచి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. సాగు నీటి ప్రాజెక్టుల ఆపరేషన్, నిర్వహణ కోసం ఏటా రూ.983 కోట్లు ఖర్చు చేయాల్సిఉండగా, గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ.275 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని అధికారులు మంత్రికి వివరించారు.
ఇంకా చదవండి: బంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12
ఈ ఏడాదికి అవసరమైన రూ.983 కోట్లు ఇచ్చేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. పంట కాలువలు, డ్రైనేజీలు, రిజర్వాయర్ల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ మేనేజ్మెంట్ పద్ధతిలో తీసుకోవాలని సీఎం సూచించారన్నారు. గత ప్రభుత్వ అసమర్థ పాలన, నిర్వహణ లోపాల కారణంగా.. ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 467 లిఫ్ట్ స్కీంలు మూలన పడ్డాయనీ.. దీంతో 2.90 లక్షల ఎకరాల సాగు తగ్గిందని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో నీటిపారుదల ప్రత్యేక చీఫ్ సెక్రటరీ జి. సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రూ.6 వేలకే ఐ ఫోన్, రూ.5 వేలకే ఆండ్రాయిడ్ ఫోన్.. ల్యాప్‌టాప్ రూ.15 వేలు మాత్రమే!
ముందుబాబులకు డబల్ కిక్కిచ్చే న్యూస్.. రూ.99 క్వార్టర్ వచ్చేసిందోచ్! ఒకరికి ఎన్ని ఇస్తారంటే?
ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఎవర్ని ఎంపిక చేశారు అంటే! కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు!
ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!
మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం కేసులో కోర్టు కీలక నిర్ణయం! టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా!
ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!
జగన్‌పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం! ఇదే తీరు కొనసాగిస్తే ఊరుకునేది లేదు!
రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్! దానా ఎఫెక్ట్.. 23, 24, 25 తేదీల్లో సుమారు 70 రైళ్లు క్యాన్సిల్!
ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలిండర్లు.. కావాల్సిన అర్హతలు, డాక్యుమెంట్స్ ఇవే! దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే!
మీ పేరుతో ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నాయా? భారీ జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష తప్పదు! ఎందుకో తెలుసా?
మహిళలు తస్మాస్ జాగ్రత్త.. ఈ లక్షణాలు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు! 30 నుంచి 52 సంవత్సరాల..
విజయవాడ మెట్రోని అమరావతికి అనుసంధానం చేయాలి! కేంద్ర, రాష్ట్ర మంత్రుల కీలక భేటీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: