ఏపీ మాజీ సీఎం జగన్పై వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వైఎస్సార్ అభిమానులకు 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. వైఎస్ అభిమానులకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే ఈ లేఖ రాసినట్లు పేర్కొన్నారు. “ఈరోజు పొద్దున సాక్షి పేపర్ చూశాను. సాక్షి మీడియా జగన్ మోహన్ రెడ్డి చేతిలో ఉంది. కాబట్టి ఏదైనా నమ్మించగలరు. అయినా వైఎస్సార్ అభిమానులకు అసలు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం నాది. అమ్మ వైఎస్ విజయమ్మ, నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఒక పుస్తకం రాశారు. అందులో నాన్న గురించి ప్రత్యేకంగా ఒక మాట రాశారు. 'రాజశేఖర్ రెడ్డి గారికి లోకం అంతా ఒకెత్తయితే.. తన బిడ్డ షర్మిల ఒకెత్తు అని రాశారు. నాన్నకు నేనంటే ప్రాణం. నాన్న నన్ను ఎప్పుడూ ఆడపిల్ల కదా అని చిన్న చేసో, తక్కువ చేసో చూడలేదు. నాన్న బతికి ఉన్నన్ని రోజులూ ఒకే మాట అనేవారు. 'నా' నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ నాకు సమానం.
నలుగురు గ్రాండ్ చిల్డ్రన్స్కూ సమాన వాటా.. అది వైఎస్సార్ మ్యాండేట్
వైఎస్సార్ బతికి ఉండగా స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాల్లో నలుగురు గ్రాండ్ చిల్డ్రన్కూ సమాన వాటా ఉండాలి. రాజశేఖర్ రెడ్డి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే. అవి జగన్ మోహన్ రెడ్డి సొంతం కాదు. ఉన్న అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ ''గార్డియన్' మాత్రమే. అన్ని వ్యాపారాలు నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచి పెట్టాల్సిన బాధ్యత ఆయనదే. ఇది రాజశేఖర్ రెడ్డి మ్యాండేట్. వైఎస్సార్ ఈ ఉద్దేశం ఆయన బిడ్డలమైన మాకు, ఆయన భార్యకు, కేవీపీ రామచంద్రరావు, వైవీ సుబ్బారెడ్డి, విజయ సాయిరెడ్డి సహా సన్నిహితులందరికీ స్పష్టంగా తెలుసు. నాన్న బతికి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాల్లో సరస్వతి, భారతి సిమెంట్స్, సాక్షి మీడియా, క్లాసిక్ రియాలిటీ, యలహంక ప్రాపర్టీ, ఇలాంటివి ఏమైనా.. నలుగురు గ్రాండ్ చిల్డ్రన్కు సమాన వాటా ఉండాలన్నది వైఎస్ఆర్ మ్యాండేట్.
ఇంకా చదవండి: అమరావతికి మరో బిగ్ న్యూస్ - కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..! ఇక ఆ ప్రాజెక్టు వేగవంతం - వారికి పండగే పండగ!
జగన్ చెబుతున్నవన్నీ కుటుంబ ఆస్తులే..
ఒక్క సండూర్ మినహా రాజశేఖర్ రెడ్డి బతికున్నంత వరకు ఏ ఒక్క ఆస్తి పంపకం కూడా జరగలేదు. వైఎస్సార్ హఠాత్తుగా మరణించారు. తర్వాత కూడా ఏ ఆస్తి పంపకాలు జరగలేదు. ఈరోజు వరకు నాకు న్యాయంగా రావాల్సిన ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో లేదు. స్వార్జితం అని జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే. రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడే ఆస్తులు పంపిణీ చేశారనేది అవాస్తవం. ఈరోజు సాక్షిలో చూపినట్లుగా మా తాతల ఆస్తి చిన్నప్పుడే నా పేరు మీద పెట్టినంత మాత్రాన, అది నాన్న నాకు పంచిన ఆస్తి కాదు. ఇతరులతో ఒక వ్యాపారంలో చిన్న భాగం నా పేరు మీద పెడితే అది ఆస్తి పంచి ఇచ్చినట్లు కాదు. ఆస్తి పంచడం అంటే ఇవిగో ఈ ఆస్తులు.. నీకు ఇక ఇంతే అని మా నాన్న నాకు చెప్పి ఉంటే అది ఆస్తి పంచేయడమంటే..! నేను జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల్లో వాటా అడుగుతున్నాను అనేది హాస్యాస్పదం. ఇవన్నీ కుటుంబ ఆస్తులు కనుక రాజశేఖర్ రెడ్డి నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచాలి అనుకున్నారు. కాబట్టే ఈ రోజు వరకు వీటి గురించి మాట్లాడుతున్నాం.
ఇంకా చదవండి: బంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12
ఏ స్వార్థం లేకుండా ఆయన పార్టీని భుజాలపై మోశాను..
నాకంటూ వ్యక్తిగతంగా ఈ ఆస్తులపై మోజు లేదు. వీళ్లు పెట్టిన హింసలకు ఈ ఆస్తులు కావాలనే కోరిక కూడా లేదు. కేవలం నా బిడ్డలకు ఈ ఆస్తులు చెందాలి అనేది రాజశేఖర్ రెడ్డి అభిమతం గనుక.. ఈ రోజు వరకు కూడా అమ్మైనా, నేనైనా తపన పడుతున్నాం. ఇప్పటికీ అమ్మ వెయ్యి సార్లు వీళ్లను అడిగి ఉంటుంది. వందల కొద్దీ లేఖలు రాసి ఉంటుంది. అయినా నా బిడ్డలకు చెందాల్సిన ఆస్తిలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత 10 ఏళ్లు జగన్ ఇబ్బందులు పడితే, అవి నా ఇబ్బందులు అనుకొని.. నా శక్తికి మించిన సాయం చేశాను. తోడబుట్టిన వాడికోసం నా బిడ్డలను సైతం పక్కన పెట్టి ఆయన్ను, ఆయన పార్టీని ఏ స్వార్థం లేకుండా నా భుజాల మీద మోశాను. ఆ 10 ఏళ్లు నా అవసరం ఉంది అనుకున్నారో.. ఏమో.. నన్ను బాగానే చూశారు. పెద్ద కూతురు అన్నారు. రాజశేఖర్ రెడ్డి ఊహించినట్లుగానే గ్రాండ్ చిల్డ్రన్ నలుగురు సమానం అన్నట్లుగానే వ్యవహరించారు. ఆ 10 ఏళ్లలో రూ.200 కోట్లు ఇచ్చామని చెప్తున్నది ఇందులో భాగంగానే. ఆ 10 ఏళ్లు నా బిడ్డలకు సమాన వాటా ఉందని గుర్తిస్తూ.. కంపెనీలోని డివిడెండ్లో సగం వాటా నాకు ఇవ్వడమే ఈ రూ.200 కోట్లు. వాళ్లు చేసింది ఉపకారం కాదు. ప్రేమతో ఇచ్చింది అంతకంటే కాదు. నాకు సమాన వాటా ఉంది కాబట్టి డివిడెండ్లో సగం వాటా ఇచ్చారు. అది కూడా అప్పుగా చూపించమన్నారు” అని లేఖలో వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రూ.6 వేలకే ఐ ఫోన్, రూ.5 వేలకే ఆండ్రాయిడ్ ఫోన్.. ల్యాప్‌టాప్ రూ.15 వేలు మాత్రమే!
ముందుబాబులకు డబల్ కిక్కిచ్చే న్యూస్.. రూ.99 క్వార్టర్ వచ్చేసిందోచ్! ఒకరికి ఎన్ని ఇస్తారంటే?
ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఎవర్ని ఎంపిక చేశారు అంటే! కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు!
ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!
మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం కేసులో కోర్టు కీలక నిర్ణయం! టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా!
ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!
జగన్‌పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం! ఇదే తీరు కొనసాగిస్తే ఊరుకునేది లేదు!
రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్! దానా ఎఫెక్ట్.. 23, 24, 25 తేదీల్లో సుమారు 70 రైళ్లు క్యాన్సిల్!
ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలిండర్లు.. కావాల్సిన అర్హతలు, డాక్యుమెంట్స్ ఇవే! దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే!
మీ పేరుతో ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నాయా? భారీ జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష తప్పదు! ఎందుకో తెలుసా?
మహిళలు తస్మాస్ జాగ్రత్త.. ఈ లక్షణాలు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు! 30 నుంచి 52 సంవత్సరాల..
విజయవాడ మెట్రోని అమరావతికి అనుసంధానం చేయాలి! కేంద్ర, రాష్ట్ర మంత్రుల కీలక భేటీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: