రాజధాని అమరావతి పనులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడంతో అమరావతిలో రాజధాని నిర్మాణాలు పూర్తిగా ఆగిపోయాయి. 2019 ఎన్నికలకు ముందు చేపట్టిన పనులు నిలిచిపోయాయి. ఇటీవలి ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని పనులకు అమరావతిలో కదలిక ప్రారంభం అయింది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయి.
ఇంకా చదవండి: భారీ శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకున్న APSRTC! ఆ సమస్యకి చెక్ పెటినటే!
ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణాలపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు. అమరావతి నిర్మాణంలో భాగంగా గతంలో పిలిచిన కాంట్రాక్టులను 15 రోజుల్లో రద్దు చేసి కొత్తవి ఆహ్వానించనున్నట్లు మంత్రి తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో అన్ని పనులకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, లే అవుట్లు, కొండవీటి, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్, కరకట్ట రోడ్డుకు టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. సచివాలయ భవనాల నిర్మాణాలకు డిసెంబర్‌లో, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో టెండర్లు ఖరారు చేస్తామని వెల్లడించారు. అమరావతి రైల్వే లైన్ కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం శుభపరిణామమంటూ ఈ సందర్బంగా మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రూ.6 వేలకే ఐ ఫోన్, రూ.5 వేలకే ఆండ్రాయిడ్ ఫోన్.. ల్యాప్‌టాప్ రూ.15 వేలు మాత్రమే!
ముందుబాబులకు డబల్ కిక్కిచ్చే న్యూస్.. రూ.99 క్వార్టర్ వచ్చేసిందోచ్! ఒకరికి ఎన్ని ఇస్తారంటే?
ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఎవర్ని ఎంపిక చేశారు అంటే! కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు!
ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!
మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం కేసులో కోర్టు కీలక నిర్ణయం! టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా!
ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!
జగన్‌పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం! ఇదే తీరు కొనసాగిస్తే ఊరుకునేది లేదు!
రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్! దానా ఎఫెక్ట్.. 23, 24, 25 తేదీల్లో సుమారు 70 రైళ్లు క్యాన్సిల్!
ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలిండర్లు.. కావాల్సిన అర్హతలు, డాక్యుమెంట్స్ ఇవే! దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే!
మీ పేరుతో ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నాయా? భారీ జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష తప్పదు! ఎందుకో తెలుసా?
మహిళలు తస్మాస్ జాగ్రత్త.. ఈ లక్షణాలు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు! 30 నుంచి 52 సంవత్సరాల..
విజయవాడ మెట్రోని అమరావతికి అనుసంధానం చేయాలి! కేంద్ర, రాష్ట్ర మంత్రుల కీలక భేటీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: