పాకిస్థాన్ అమ్మాయికి, భారతదేశ అబ్బాయికి అనివార్య పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో వివాహం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడి కుమారుడు అనూహ్యంగా ఈ విధంగా ప్రత్యేక రీతిలో ‘నికా’ చేసుకోవాల్సి వచ్చింది. బీజేపీ కార్పొరేటర్ అయిన తహసీన్ షాహిద్ పెద్ద కొడుకు మహ్మద్ అబ్బాస్ హైదర్ పాక్‌లోని లాహోర్‌కు చెందిన ఆండ్లీప్ జహ్రాను పెళ్లి చేసుకున్నాడు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్య వివాదాల కారణంగా వరుడు షాహిద్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా దక్కలేదు. దానికి తోడు వధువు తల్లి యాస్మిన్ జైదీ అనారోగ్యంతో ఐసీయులో చేరడం పెళ్లికి మరింత ఆటంకాలుగా మారాయి. దీంతో పెళ్లి వేడుకను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని షాహిద్ నిర్ణయించుకున్నాడు. పెళ్లి కూతురు తరపువారు కూడా అంగీకారం తెలపడంతో ఆన్‌లైన్‌లోనే పెళ్లి తంతుని ముగించారు. శుక్రవారం రాత్రి ఆన్‌లైన్‌లో నికా జరిగింది. ఇక్కడి నుంచి షాహిద్ కుటుంబ సభ్యులు, లాహోర్ నుంచి వధువు కుటుంబం ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వివాహంపై షియా మత పెద్ద మౌలానా మహఫూజుల్ హసన్ ఖాన్ స్పందించారు. ఇస్లాంలో నికాకు స్త్రీ అంగీకారం చాలా ముఖ్యమని, తన సమ్మతిని ఆమె మౌలానాకు తెలియజేస్తుందని చెప్పారు. ఇరువైపుల మౌలానాలు కలిసి వేడుకను నిర్వహించగలిగినప్పుడు ఆన్‌లైన్‌లో నికా సాధ్యమవుతుందని ఆయన వివరించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆధార్ కార్డ్ ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! జిల్లాలలో 5 నుంచి 15 ఏళ్ల వయసు!
రూ.3 లక్షల 50 వేల జీతం.. పరీక్ష లేకుండా నేరుగా జాబ్, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఇదే!
వైసీపీ షాక్.. మాజీ ఎంపీని కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు! 48 గంటల పాటు..
అర్ధరాత్రి ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియోకాల్! ఎందుకు.. ఎవరు..? తర్వాత ఏమైందంటే?
నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం! ఆ నేతల గుండెల్లో గుబులు! ప్రజాప్రతినిధులకు కీలక సూచనలు!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఇక ఆ సమస్యలకు చెక్!!
నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.25 వేలు.. ఇలా చేయండి! ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ రాదు!
మందు బాబులకు షాక్ - మద్యం ధరల పెంపు! ఒక్క బీరు ఎంతంటే..?
వరదల ప్రాంతంలో సేవ చేయడమే ఐఏఎస్ అధికారుల బాధ్యత! వెళ్లాల్సిందే" అంటు క్యాట్ కీలక నిర్ణయం!
48 గంటల్లో అత్యాచార నిందితులను అరెస్టు చేసిన పోలీసులు! ఘోర ఘటనకు కఠిన జవాబు-హోం మంత్రి!
ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్! ఆ రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకం!
ఏపీ జిల్లాలకు నూతన ఇన్చార్జి మంత్రుల ఎంపిక! ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: