వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన మరియమ్మ అనే మహిళ హత్య కేసులో గుంటూరు జిల్లా జైలులో నందిగం సురేశ్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పోలీసులు మంగళగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారించిన కోర్టు 48 గంటల పాటు (రెండు రోజులు) కస్టడీకి అనుమతి ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నందిగం సురేశ్‌ను ఈ రోజు (శనివారం) పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ రోజు, రేపు ఆయనను పోలీసులు కస్టడీలో విచారించనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11.30 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పోలీసులు ఆయనను ప్రశ్నించనున్నారు. కాగా, డిసెంబర్ 2020లో వెలగపూడిలో రెండు సామాజికవర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. నాడు ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తుళ్లూరు పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈ కేసులో సురేశ్ ను 78వ నిందితుడుగా పోలీసులు చేర్చారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అర్ధరాత్రి ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియోకాల్! ఎందుకు.. ఎవరు..? తర్వాత ఏమైందంటే?
నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం! ఆ నేతల గుండెల్లో గుబులు! ప్రజాప్రతినిధులకు కీలక సూచనలు!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఇక ఆ సమస్యలకు చెక్!!
నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.25 వేలు.. ఇలా చేయండి! ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ రాదు!
మందు బాబులకు షాక్ - మద్యం ధరల పెంపు! ఒక్క బీరు ఎంతంటే..?
వరదల ప్రాంతంలో సేవ చేయడమే ఐఏఎస్ అధికారుల బాధ్యత! వెళ్లాల్సిందే" అంటు క్యాట్ కీలక నిర్ణయం!
48 గంటల్లో అత్యాచార నిందితులను అరెస్టు చేసిన పోలీసులు! ఘోర ఘటనకు కఠిన జవాబు-హోం మంత్రి!
ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్! ఆ రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకం!
ఏపీ జిల్లాలకు నూతన ఇన్చార్జి మంత్రుల ఎంపిక! ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: