తాజాగా ఏపీలో రోడ్ల గుంతలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రస్తుతం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకంపై ఫోకస్ పెట్టామన్న ఆయన.. రోడ్లను బాగు చేసే అంశాన్ని కూడా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలిపారు. నవంబర్ 1 నుంచి రోడ్ల మరమ్మతులు ప్రారంభం అవుతాయనీ, యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు జరుగుతాయని తెలిపారు. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో ఏ రోడ్డుపైనా గుంతలు కనిపించడానికి వీల్లేదని అధికారులకు తెలిపారు చంద్రబాబు. ఆర్‌అండ్‌బీ (R&B) పరిధిలోని రహదారుల్లో గుంతలు పూడ్చడానికి రూ.600 కోట్లు ఇచ్చామన్న ఆయన.. అవసరమైతే మరో రూ.300 కోట్లు ఇస్తామన్నారు. అందువల్ల సంక్రాంతి నాటికి ఏపీ రోడ్లు అద్దాల్లా మారిపోకపోయినా, కనీసం గుంతలు లేకుండా ఉంటాయని ఆశించవచ్చు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల రెండవ విడత లిస్టు రేపే? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, రాజ్యసభ సభ్యుల సమావేశం తరువాత..?
కాంట్రాక్టర్లు రోడ్లను సరిగా వెయ్యకపోతే, అవి త్వరలోనే తిరిగి పాడైపోతాయి. అందుకే ఈ కూటమి ప్రభుత్వం టెక్నాలజీని వాడాలని డిసైడ్ అయ్యింది. డ్రోన్లతో రహదారుల పరిస్థితిపై సర్వే చేసి, రోడ్లు వేశాక కూడా పరిస్థితి ఎలా ఉందో డ్రోన్లతో చెక్ చెయ్యబోతున్నారు. అంటే.. ఇది, వైసీపీ స్కూళ్ల కోసం నాడు-నేడు తెచ్చినట్లుగా.. సీఎం చంద్రబాబు.. రోడ్లకోసం.. నాడు నేడు తెస్తున్నారని అనుకోవచ్చు. కేంద్ర సహకారంతో రూ.55 వేల కోట్లతో రహదారులు నిర్మిస్తున్నామనీ, మరో రూ.30 వేల కోట్లతోనూ రోడ్ల నిర్మాణానికి అనుమతి వస్తుందని చంద్రబాబు అన్నారు. ఐతే.. కేంద్రం ఇచ్చే నిధులతో జాతీయ రహదారులే ఎక్కువగా నిర్మించే అవకాశాలు ఉంటాయి. రాష్ట్రంలో రోడ్లకు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చెయ్యాల్సి రావచ్చు. అయినా సీఎం మాత్రం చాలా కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మందు బాబులకు షాక్ - మద్యం ధరల పెంపు! ఒక్క బీరు ఎంతంటే..?
వరదల ప్రాంతంలో సేవ చేయడమే ఐఏఎస్ అధికారుల బాధ్యత! వెళ్లాల్సిందే" అంటు క్యాట్ కీలక నిర్ణయం!
48 గంటల్లో అత్యాచార నిందితులను అరెస్టు చేసిన పోలీసులు! ఘోర ఘటనకు కఠిన జవాబు-హోం మంత్రి!
ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్! ఆ రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకం!
ఏపీ జిల్లాలకు నూతన ఇన్చార్జి మంత్రుల ఎంపిక! ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు!
155 వైన్ షాపులకు దరఖాస్తు చేసిన ఢిల్లీ వ్యాపారి! చివరకు ఎన్ని షాపులు దక్కాయంటే!
జుపిటర్ మీదా బతికేద్దాం! రూ. 43,700 కోట్లతో నాసా వ్యోమనౌక ప్రయోగం!
ఒక్కో మహిళకు రూ.3 వేలు.. ప్రభుత్వం దీపావళి పండుగ కానుక అదరహో! అర్హతలు ఏంటివి?
మీ బెంగళూరులో ఏమో కానీ... ఇక్కడ మాత్రం! జగన్ కు టీడీపీ కౌంటర్! ఏ నిమిషమైనా తాడేపల్లి కొంప వరకు!
ఏపీలో మద్యం దుకాణాల కోసం నేడే లాటరీ! అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువగా!
మంత్రి కొండా సురేఖను వదలని వివాదాలు! అధికారులపై ఆగ్రహం వ్యక్తం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: