మద్యం ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. మద్యం ధరలు పెంచాలని బ్రూవరీలు... ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. అదే జరిగితే ధరలు 15 శాతం వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా ప్రభుత్వం ధరలను ప్రతి రెండేళ్లకోసారి పెంచుతుంది. వివిధ రకాల మద్యంపై రూ.20 నుంచి రూ.150 వరకు పెంచాలని బ్రూవరీలు ప్రభుత్వాన్ని కోరాయి. తెలంగాణలోని 6 బ్రూవరీల్లో ప్రతి సంవత్సరం 88 కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి అవుతోంది.
ఇంకా చదవండి: సుప్రీంకోర్టు సమర్థించిన సెక్షన్ 6A! బంగ్లాదేశ్ వలసదారుల పౌరసత్వంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు!
ప్రతి సంవత్సరం దసరా పండుగ సమయంలో మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతాయి. ఈసారి పది రోజుల వ్యవధిలో రూ.1,100 కోట్లకు పైగా మద్యాన్ని తెలంగాణ మందుబాబులు తాగేశారు. మద్యం అమ్మకాల్లో ఈసారి కూడా హైదరాబాద్ ముందు నిలిచింది. సెప్టెంబర్ 30 వరకు రూ.2,838 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా... అక్టోబర్ నెల ప్రారంభం నుంచి 11వ తేదీ వరకు రూ రూ.1,100 కోట్ల విలువైన 10 లక్షల 44 వేల కేసుల మద్యం అమ్మకాలు జరిగాయని ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. 10 రోజుల వ్యవధిలో 17 లక్షల 59 వేల బీర్లు అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వరదల ప్రాంతంలో సేవ చేయడమే ఐఏఎస్ అధికారుల బాధ్యత! వెళ్లాల్సిందే" అంటు క్యాట్ కీలక నిర్ణయం!
48 గంటల్లో అత్యాచార నిందితులను అరెస్టు చేసిన పోలీసులు! ఘోర ఘటనకు కఠిన జవాబు-హోం మంత్రి!
ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్! ఆ రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకం!
ఏపీ జిల్లాలకు నూతన ఇన్చార్జి మంత్రుల ఎంపిక! ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు!
155 వైన్ షాపులకు దరఖాస్తు చేసిన ఢిల్లీ వ్యాపారి! చివరకు ఎన్ని షాపులు దక్కాయంటే!
జుపిటర్ మీదా బతికేద్దాం! రూ. 43,700 కోట్లతో నాసా వ్యోమనౌక ప్రయోగం!
ఒక్కో మహిళకు రూ.3 వేలు.. ప్రభుత్వం దీపావళి పండుగ కానుక అదరహో! అర్హతలు ఏంటివి?
మీ బెంగళూరులో ఏమో కానీ... ఇక్కడ మాత్రం! జగన్ కు టీడీపీ కౌంటర్! ఏ నిమిషమైనా తాడేపల్లి కొంప వరకు!
ఏపీలో మద్యం దుకాణాల కోసం నేడే లాటరీ! అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువగా!
మంత్రి కొండా సురేఖను వదలని వివాదాలు! అధికారులపై ఆగ్రహం వ్యక్తం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: