ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైసీపీ అధినేత జగన్.. సీఎం చంద్రబాబు కంటే.. ఆయన కొడుకైన మంత్రి నారా లోకేష్‌ని చూసి ఎక్కువగా భయపడుతున్నారు. మాటిమాటికీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని లోకేష్‌ని హైలెట్ చేస్తున్నారు. తద్వారా.. తనకు లోకేషే గట్టి పోటీ అనే సంకేతాలిస్తున్నారు. అలా తన స్థాయిని ఆయనే తగ్గించుకుంటున్నారు. అది అలా ఉంచితే.. గత వైసీపీ పాలనపై కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని డిసైడ్ అయిన నారా లోకేష్ అంతపనీ చేస్తున్నారు. జగన్ ఏమేం చేశారో లెక్కలన్నీ తీస్తున్నారు. తాజాగా జగన్.. ప్రభుత్వం డబ్బును సొంత అవసరాలకు వాడేసుకున్నారనీ, ఇది చట్ట విరుద్ధం అని లోకేష్ వాయిస్ పెంచారు. ఇది నిజమే అయితే, జగన్‌ని చట్ట ప్రకారం శిక్షించవచ్చు అనేది ఒక యాంగిల్. అసలు లోకేష్ ఏ అంశంపై ఈ ఆరోపణలు చేశారంటే.. జగన్ సీఎంగా అధికారంలో ఉన్న సమయంలో సొంత అవసరాలకు ప్రజా ధనాన్ని ఉపయోగించారని లోకేశ్ ట్వీట్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఇనుప కంచె వేసేందుకు, రాష్ట్ర ఖజానా నుంచి రూ.12.85 కోట్లు వాడారని అన్నారు. పేదల ఇళ్ల కోసం వాడాల్సిన డబ్బును అత్యవసర భద్రతా కారణాలు చెప్పి వాడేసుకున్నారని తెలిపారు.
ఇంకా చదవండి: మంత్రివర్గ భేటీ - వాలంటీర్లు, అమ్మకు వందనంపై కీలక నిర్ణయం! దీపావళి నాడు ఈ పథకం అమలు!
తన అవసరాల కోసం ప్రజాధనాన్ని వాడిన జగన్ ఆన్సర్ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. లోకేష్ ట్వీట్‌లో సారాంశం ఇదే: "ఇలా జగన్ 12.85 కోట్లు స్వాహా చేశారు. తన వ్యక్తిగత ఉపయోగం కోసం ప్రజల సొమ్ముతో ఆయన తన తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ 30 అడుగుల ఇనుప కంచెను నిర్మించారు, దానికి పూర్తిగా, నగదు కొరత ఉన్న రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించారు. పేదల ఇళ్ల కోసం ఖర్చు చేయగలిగే భారీ మొత్తాన్ని, ఖర్చు చేయడానికి జగన్, అత్యవసర భద్రతా కారణాలు చెప్పుకున్నారు. జగన్ తన ఆనందాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేసిన టన్నుల కొద్దీ ప్రజాధనానికి లెక్కలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది" అని కోరారు. ఎవరో ఈ కామెంట్స్ చేసి ఉంటే, పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ లోకేష్ ఇప్పుడు మంత్రి. పైగా కూటమి ప్రభుత్వంలో ఆయన కీలకం. టీడీపీలో ఆయన మాటకు తిరుగులేదు. ఆల్రెడీ జగన్.. వైజాగ్‌లో రుషికొండపై కట్టించిన భవనాలతో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. జగన్ లగ్జరీ లైఫ్ స్టైల్ కోరుకుంటున్నారనీ, ఎన్నికల్లో గెలిచివుంటే, రుషికొండ ప్యాలెస్‌లోనే ఉండేవారనే విమర్శలొచ్చాయి. ఇప్పుడు తాడేపల్లి ఇంటికి కూడా ప్రజాధనాన్ని వాడేసుకున్నారనే విమర్శలు వైసీపీకి షాక్ ఇచ్చేవే.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వరదల ప్రాంతంలో సేవ చేయడమే ఐఏఎస్ అధికారుల బాధ్యత! వెళ్లాల్సిందే" అంటు క్యాట్ కీలక నిర్ణయం!
48 గంటల్లో అత్యాచార నిందితులను అరెస్టు చేసిన పోలీసులు! ఘోర ఘటనకు కఠిన జవాబు-హోం మంత్రి!
ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్! ఆ రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకం!
ఏపీ జిల్లాలకు నూతన ఇన్చార్జి మంత్రుల ఎంపిక! ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు!
155 వైన్ షాపులకు దరఖాస్తు చేసిన ఢిల్లీ వ్యాపారి! చివరకు ఎన్ని షాపులు దక్కాయంటే!
జుపిటర్ మీదా బతికేద్దాం! రూ. 43,700 కోట్లతో నాసా వ్యోమనౌక ప్రయోగం!
ఒక్కో మహిళకు రూ.3 వేలు.. ప్రభుత్వం దీపావళి పండుగ కానుక అదరహో! అర్హతలు ఏంటివి?
మీ బెంగళూరులో ఏమో కానీ... ఇక్కడ మాత్రం! జగన్ కు టీడీపీ కౌంటర్! ఏ నిమిషమైనా తాడేపల్లి కొంప వరకు!
ఏపీలో మద్యం దుకాణాల కోసం నేడే లాటరీ! అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువగా!
మంత్రి కొండా సురేఖను వదలని వివాదాలు! అధికారులపై ఆగ్రహం వ్యక్తం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: