ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. ఈ పథకం అమలు విషయమై ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పలు సందర్భాల్లో మాట్లాడారు. తాజాగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఈ స్కీమ్‌పై కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం ఈ దీపావళి పండుగకు ఉచిత సిలిండర్ పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు. అలాగే దీపావళి మరుసటి రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.చిత్తూరు జిల్లాలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఇంకా చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మళ్ళి గట్టి షాక్! ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంకా పెన్షన్లు పెంచాలి.. రేషన్ కార్డులు ఇవ్వాలి.. ఎన్టీఆర్ గృహాలు ఇవ్వాలి.. ఇంకా ఎన్నో ఇవ్వాలని వచ్చామని అన్నారు. వైసీపీ వాళ్లు ఉంటే బాగుండు.. వాళ్లేమీ చేయరు.. వీళ్చొచ్చి రోడ్లు, గీడ్లు వేస్తున్నారని బాధగా ఉందా? అని కార్యక్రమానికి వచ్చిన వారిని తమాషాగా అడిగారు. మీరు ఆనందంగా ఉండాలనే అన్ని స్కీమ్‌లను మహిళలను ఉద్దేశించే చంద్రబాబు తీసుకొచ్చారని పేర్కొన్నారు. దీపావళికి ఉచిత సిలిండర్ పథకం అమలు చేస్తామన్న ఆయన... ఆ మరుసటి రోజు నుంచే ఫ్రీ బస్ స్కీమ్‌ను ప్రారంభిస్తామని అన్నారు. ఇలా దీపావళికి డబుల్ ధమాకా అంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఇదే విషయాన్ని 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా కూడా ఎమ్మెల్యే జగన్ ప్రకటించారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మీ బెంగళూరులో ఏమో కానీ... ఇక్కడ మాత్రం! జగన్ కు టీడీపీ కౌంటర్! ఏ నిమిషమైనా తాడేపల్లి కొంప వరకు!
ఏపీలో మద్యం దుకాణాల కోసం నేడే లాటరీ! అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువగా!
మంత్రి కొండా సురేఖను వదలని వివాదాలు! అధికారులపై ఆగ్రహం వ్యక్తం!
వైసీపీకి మరో షాక్! పార్టీ వీడనున్నట్లు మాజీ ఎమ్మెల్యే ప్రకటన!
ఆ మాజీ మంత్రిని చంపింది మేమే! లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన!
రేపే మద్యం దుకాణాలకు డ్రా! ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా?
పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ! 11 మంది దుర్మరణం!
దేశంలో తయారయ్యే విదేశీ మద్యం రేట్లు పెరుగుదల! అదనపు ప్రివిలేజ్ ఫీజు వసూలు! గరిష్టంగా ఎంత అంటే?
చంపేస్తామంటూ 15 రోజుల క్రితమే వార్నింగ్! అన్నట్టుగానే మాజీ మంత్రి హత్య!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: