ఏపీలో లిక్కర్ షాపుల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. అందరి సమక్షంలో, సీసీ కెమెరాల నిఘాలో లక్కీ డ్రా తీశారు. అనంతరం షాపులు దక్కించుకున్న వారికి అధికారులు లైసెన్స్‌లు ఇచ్చారు. షాపుల దక్కించుకున్న వారిచేత అప్పటికప్పుడే లైసెన్స్ ఫీజును వసూలు చేశారు అధికారులు. అక్కడే క్యాష్ కౌంటింగ్ మెషీన్లతో లెక్కించి.. ఖజానాలో డిపాజిట్ చేశారు. ఈ నెల 16 నుంచి.. అంటే వచ్చే బుధవారం నుంచే ఏపీలో కొత్త లిక్కర్ విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3వేల 396 మద్యం దుకాణాలకు 89వేల 882 దరఖాస్తులు వచ్చాయి. నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో ప్రభుత్వానికి 17వందల 97 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఇక లైసెన్స్ ఫీజుల రూపంలోనూ ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చింది.
ఇంకా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త.. సంచలన పథకం తీసుకురానున్న చంద్రబాబు! దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేల మందికి!
ఈ సారి మద్యం టెండర్లలో మహిళలు, విద్యావంతులు కూడా లిక్కర్ టెండర్లలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా మద్యం షాపులను దక్కించుకున్న వారిలో మహిళలు సత్తా చాటారు. మొత్తం 3,396 మద్యం షాపులకు డ్రా తీయగా.. ఇందులో 345 షాపులు మహిళ పేరు మీద వచ్చాయి. అంటే మొత్తం షాపుల్లో 10.2 శాతం మహిళలకు లిక్కర్ షాపుల లైసెన్సులు దక్కాయి. తాజాగా నివేదిక ప్రకారం.. లిక్కర్ లైసెన్స్ పొందిన మహిళలు జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా విశాఖలో లో 31 మద్యం షాపులు దక్కించుకోగా.. అత్యల్పంగా బాపట్ల జిల్లాలో ఒక మహిళకు వైన్ షాప్ లైసెన్స్ దక్కింది. కాగా ఈ కొత్త మద్యం పాలసీ ఏపీ రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. దీంతో గతంలో అందుబాటులో ఉన్న బ్రాండ్‌లు కాకుండా.. 2019కి ముందు అందుబాటులో ఉన్న మద్యాన్ని ప్రజలకు అందించనున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఒక్కో మహిళకు రూ.3 వేలు.. ప్రభుత్వం దీపావళి పండుగ కానుక అదరహో! అర్హతలు ఏంటివి?
మీ బెంగళూరులో ఏమో కానీ... ఇక్కడ మాత్రం! జగన్ కు టీడీపీ కౌంటర్! ఏ నిమిషమైనా తాడేపల్లి కొంప వరకు!
ఏపీలో మద్యం దుకాణాల కోసం నేడే లాటరీ! అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువగా!
మంత్రి కొండా సురేఖను వదలని వివాదాలు! అధికారులపై ఆగ్రహం వ్యక్తం!
వైసీపీకి మరో షాక్! పార్టీ వీడనున్నట్లు మాజీ ఎమ్మెల్యే ప్రకటన!
ఆ మాజీ మంత్రిని చంపింది మేమే! లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన!
రేపే మద్యం దుకాణాలకు డ్రా! ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా?
పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ! 11 మంది దుర్మరణం!
దేశంలో తయారయ్యే విదేశీ మద్యం రేట్లు పెరుగుదల! అదనపు ప్రివిలేజ్ ఫీజు వసూలు! గరిష్టంగా ఎంత అంటే?
చంపేస్తామంటూ 15 రోజుల క్రితమే వార్నింగ్! అన్నట్టుగానే మాజీ మంత్రి హత్య!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: