ఏపీకి కేంద్రం మరో భారీ శుభవార్త చెప్పింది. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రిజల్ట్ కేంద్రం కేటాయింపుల్లో కనిపిస్తోంది. తాజాగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్రం భారీ నిధులను విడుదల చేసింది. మొత్తం రూ. 988.773 కోట్లు రాష్ట్రంలోని పంచాయతీలకు అందించాయి. ఈ నిధులు 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ద్వారా విడుదల చేయబడ్డాయి. అన్‌టైడ్ గ్రాంట్ కింద రూ. 395.5091 కోట్లు, టైడ్ గ్రాంట్ కింద రూ. 593.2639 కోట్ల నిధులకు కేంద్రం ఏపీకి కేటాయించింది. ఈ నిధులు రాష్ట్రంలోని 9 జెడ్పీలు, 615 మండల పంచాయతీలు, 12,853 గ్రామ పంచాయతీలకు వర్తిస్తాయి.
అన్‌టైడ్ గ్రాంట్ వినియోగం: ఈ నిధులను స్థానిక అవసరాల కోసం వినియోగించుకోవచ్చు. కానీ జీతాలు లేదా పరిపాలన ఖర్చుల కోసం వినియోగించరాదు. వ్యవసాయం, గ్రామీణ గృహనిర్మాణం, పారిశుద్ధ్యం, విద్య వంటి అంశాల కోసం ఈ నిధులను వాడుకోవచ్చు.
ఇంకా చదవండి: మహిళలకు సున్నా వడ్డీకే రూ.10 లక్షలు.. ప్రభుత్వం శుభవార్త! అది ఎలానో మీకు తెలుసా? ఆ వివరాలు చూడండి!
టైడ్ గ్రాంట్ వినియోగం: ఈ నిధులను నీటి యాజమాన్యం, వాననీటి సంరక్షణ, పారిశుద్ధ్యం, మురికినీటి రీసైక్లింగ్ వంటి మౌలిక సదుపాయాల కోసం వినియోగించాలి. ఇదిలా ఉంటే, ఏపీ ప్రభుత్వం పల్లెపండగ వారోత్సవాల్లో భాగంగా గ్రామాల అభివృద్ధికి పెద్ద ఎత్తున కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. రూ. 4,500 కోట్ల నిధులతో 30,000 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా కంకిపాడులో పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పల్లెపండగ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. గ్రామాల్లో రోడ్లు, వాననీటి సంరక్షణ కందకాలు, గోకులాలు వంటి మౌలిక వసతుల పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక రోడ్ల నిర్మాణానికి కావలసిన సిమెంట్‌ను స్థానిక మార్కెట్ల నుంచి రూ. 270 చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మంత్రి కొండా సురేఖను వదలని వివాదాలు! అధికారులపై ఆగ్రహం వ్యక్తం!
వైసీపీకి మరో షాక్! పార్టీ వీడనున్నట్లు మాజీ ఎమ్మెల్యే ప్రకటన!
ఆ మాజీ మంత్రిని చంపింది మేమే! లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన!
రేపే మద్యం దుకాణాలకు డ్రా! ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా?
పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ! 11 మంది దుర్మరణం!
దేశంలో తయారయ్యే విదేశీ మద్యం రేట్లు పెరుగుదల! అదనపు ప్రివిలేజ్ ఫీజు వసూలు! గరిష్టంగా ఎంత అంటే?
చంపేస్తామంటూ 15 రోజుల క్రితమే వార్నింగ్! అన్నట్టుగానే మాజీ మంత్రి హత్య!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: