ఏపీ ప్రభుత్వం ఇటీవల కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కొత్త మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇక ఒక్కో దరఖాస్తుకు నాన్ రిఫండబుల్ ఫీజు కింద రూ.2లక్షలు వసూలు చేస్తోంది. దీంతో ఏపీ సర్కార్ ఖజానాకు భారీ ఆదాయం వచ్చి చేరింది. బుధవారం రాత్రి వరకు మొత్తం 57,709 దరఖాస్తులు రాగా.. ఫీజు రూపంలో రూ. 1154. 18 కోట్ల ఆదాయం సమకూరింది. ఇవాళ, రేపు కూడా దరఖాస్తులకు అవకాశం ఉంది. దీంతో మరో 40వేల వరకు దరఖాస్తులు రావొచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇంకా చదవండి: పవన్ వచ్చిన సమయంలో భక్తులకు ఎలాంటి ఆటంకం కలగలేదన్న హోంమంత్రి! సీఎం వచ్చే సమయంలో!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10
ఈ క్రమంలో ఎన్‌టీఆర్ జిల్లా వత్సవాయిలో రెండు దుకాణాలకు అత్యధికంగా 217 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే అత్యధికంగా ఎన్‌టీఆర్ జిల్లాలో 4,420, ఏలూరులో 3,843, విజయనగరంలో 3,701 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,396 దుకాణాలు ఉన్నాయి. ఇక వచ్చిన దరఖాస్తుల నుంచి లాటరీ తీసి, దుకాణదారులను ఎంపిక చేస్తారు. 16 నుంచి దుకాణాలను కేటాయిస్తామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఆ రోజు నుంచే కొత్త మద్యం పాలసీ అమలులోకి వస్తుంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. ఏకంగా శ్రీవారి సన్నిధిలోనే ఛీ ఛీ!
ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ! రూ.73,743 కోట్ల పెట్టుబడులతో..
మందుబాబులకు డబుల్ కిక్కు.. మరో రెండు రోజులు మాత్రమే! ఇక వీటితో పాటు.. గీత కార్మికులు సైతం!
పాన్ కార్డులో వివరాలు మార్చాలి అనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి!
విద్యార్థులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త.. కీలక ప్రకటన! ఇందుకోసం విద్యార్థులు ఏమి చేయాలి అంటే!
లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం! డెన్మార్క్ కు మళ్లింపు! ఎందుకంటే?
వైసీపీకి వరుస షాక్ లు! రేపు టీడీపీలో చెరనున్న పార్టీ కీలక నేతలు!
చికెన్ లివర్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: