టెక్కలి వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీ ఓపెన్‌గా తిరిగేస్తున్నారు. తాజాగా ఇద్దరూ.. తమ సన్నిహితులతో కలిసి తిరుమలకు కూడా వచ్చారు. జంటగా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. వారు ఏం కోరుకున్నారో తెలియదు గానీ.. వారి తీరు మాత్రం వివాదాస్పదం అయ్యింది. ఈ జంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో.. నెటిజన్లు అసలు వీళ్లు కొండపై ఏం చేశారనేది లోతుగా పరిశీలించారు. ఆ క్రమంలో ఒక విషయం బయటపడింది. అది ఇప్పుడు వారికి తలనొప్పిగా మారే ప్రమాదం కనిపిస్తోంది. తిరుమలకు వచ్చిన దువ్వాడశ్రీనివాస్, దివ్వెల మాధురి ఫొటోషూట్ చేయించుకున్నారని తెలిసింది. ఇలాంటివి కొండపై నిషేధం. స్వామి వారి సన్నిధిలో.. భక్తి మాత్రమే ఉండాలి. ఎక్స్‌ట్రాలు ఏవీ ఉండకూడదు. కానీ వీరిద్దరూ కలిసి.. హాయిగా పోజులిస్తూ ఫొటోషూట్ చేయించుకున్నారనే వివాదం తెరపైకి వచ్చింది. దివ్వెల మాధురి తిరు మాఢ వీధుల్లో, పుష్కరిణి దగ్గర ఫొటోలు తీయించుకోవడం చర్చకు దారితీసింది.
ఇంకా చదవండి: మరోసారి ఎంజీఆర్ గురించి ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్! ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్!
ఇలాంటివి కొండపై చెయ్యకూడదు అని చెప్పాల్సిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. అది మానేసి.. తనే దగ్గరుండి.. మాధురిని ఫొటోలు తీయించారని టాక్ వినిపిస్తోంది. ఇదివరకు చాలా మంది సెలబ్రిటీలు ఇలాగే కొండకు వచ్చి.. ఫొటోషూట్లు చేయించుకొని చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడు ఈ జంట కూడా నెట్టింట విమర్శలు ఎదుర్కొంటోంది. దీనిపై ఇంకా ఎక్కడా కేసు నమోదు కాలేదు. మరి టీటీడీ ఈ అంశంపై స్పందిస్తుందా, ఇలాంటివి చెయ్యవద్దని సూచిస్తుందా అనేది ఒకట్రెండు రోజుల్లో తెలుస్తుంది. తిరుమలలో మీడియాతో మాట్లాడిన దువ్వాడ శ్రీనివాస్, తాను దివ్వెల మాధురిని పెళ్లి చేసుకోలేదని అన్నారు. తన భార్య వాణితో తన విడాకుల కేసు కోర్టులో ఉందనీ, కోర్టు కేసు పూర్తయిన తర్వాత, వివాహం చేసుకుంటామని తెలిపారు. విడాకులు తీసుకోకుండా.. మరి ఈ చెట్టాపట్టాలేంటి, ఫొటోషూట్లేంటి అని భక్తులు మండిపడుతున్నారు.
ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వాలంటీర్లకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచే రూ.10వేలు, ఉద్యోగం! ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు!
పది పాస్ అయితే చాలు.. నెలకు రూ.20 వేలు పొందొచ్చు, ఎలా అంటే! రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో!
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్! 20 వేల మంది నివాసం!
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సృష్టించిన సంకేతాలు! కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల అంచనాలు!
మరికాసేపట్లో చంద్రబాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ! పెళ్లి కారణంగా చాలా కాలం!
తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! టీడీపీలో చెరనున్న మాజీ ఎమ్మెల్యే!
మరోసారి ఎంజీఆర్ గురించి ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్! ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: