కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, విభాగాలు ప్రజలకు అందించే వస్తుసేవల ధరలను ఎప్పటికప్పుడు సవరిస్తుంటాయి. ప్రతి నెలా కొన్ని మార్పులు చోటుచేసుకోవడం కామన్. అయితే ఇవి ప్రజల ఆర్థిక పరిస్థితిపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం చూపుతాయి. మరో మూడు రోజుల్లో అక్టోబర్ నెల ప్రారంభం కానుంది. అయితే వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రజలు, వ్యాపారాలను ప్రభావితం చేసే కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు ప్రజల రోజువారీ జీవితం, ఖర్చులపై ప్రభావం చూపనున్నాయి. వీటిపై సరైన అవగాహన ఉంటే ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. 2024 అక్టోబర్ 1 నుంచి మారనున్న 5 ఫైనాన్సియల్ రూల్స్ ఏవో తెలుసుకుందాం.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)..
అక్టోబర్ 1 నుంచి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకంలో మూడు ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి.
మైనర్ అకౌంట్ వడ్డీ చెల్లింపులు: మైనర్లు స్వతంత్రంగా అకౌంట్‌ని నిర్వహించే అర్హత పొందే వరకు, అంటే వారికి 18 ఏళ్లు వచ్చే వరకు పోస్టాఫీస్ ఆఫీస్ అకౌంట్(POSA) రేటుతో వడ్డీ అందుతుంది. ఆ తర్వాత PPF వడ్డీ రేటు వర్తిస్తుంది.
మెచ్యూరిటీ కాలిక్యులేషన్: మైనర్ల పీపీఎఫ్ అకౌంట్ మెచ్యూరిటీ పీరియడ్‌ను, ఇప్పుడు వారికి 18 ఏళ్లు నిండిన తేదీ నుంచి కాలిక్యులేట్ చేస్తారు. అకౌంట్ ఓపెన్ చేసిన తేదీని పరిగణనలోకి తీసుకోరు.
మల్టిపుల్ PPF అకౌంట్లు: ఒక వ్యక్తికి ఒక PPF అకౌంట్ మాత్రమే ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ అకౌంట్లు ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.
ఇంకా చదవండి: పోలీస్ కస్టడీలో కీలక విషయాలను వెల్లడించిన జానీ మాస్టర్...? ఆమె చేస్తున్న ఆరోపణలు!
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్..
2024 అక్టోబర్ 1 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల విధానాన్ని మారుస్తుంది. స్మార్ట్‌బయ్(SmartBuy) ప్లాట్‌ఫామ్ ద్వారా క్యాలెండర్ త్రైమాసికంలో ఒక యాపిల్ ప్రొడక్టుకు మాత్రమే కస్టమర్లు రివార్డ్ పాయింట్లను ఉపయోగించగరు.
సుకన్య సమృద్ధి యోజన (SSY)
అక్టోబర్ 1 నుంచి సుకన్య సమృద్ధి యోజన (SSY) అకౌంట్లను ఆడపిల్లల లీగల్ గార్డియన్లు మాత్రమే నిర్వహించాలి. SSY అకౌంట్‌ను ఇతరులు ఎవరైనా ఓపెన్ చేసినా, ఇప్పుడు ఆమె తల్లిదండ్రులకు లేదా లీగల్ గార్డియన్లకు ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే అకౌంట్ క్లోజ్ అయ్యే ప్రమాదం ఉంది.
ఎల్‌పీజీ సిలిండర్ ధరలు..
2024 అక్టోబర్ 1న ఆయిల్ కంపెనీలు ఎల్‌పీజీ సిలిండర్ ధరలను అప్‌డేట్ చేయనున్నాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలు తరచూ మారుతుండగా, 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర కొంతకాలంగా స్థిరంగా ఉంది. దీపావళి సమీపిస్తున్న తరుణంలో ఎల్‌పీజీ సిలిండర్ల ధర తగ్గే అవకాశం ఉందని, ప్రజలకు ఇంటి ఖర్చుల నుంచి కొంత ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. 2024 సెప్టెంబర్‌లో నగరాల్లో వాణిజ్య సిలిండర్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో ధర రూ.1,652.50 నుంచి రూ.1,691.50కి పెరిగింది. కోల్‌కతాలో రూ.1,764.50 నుంచి రూ.1,802.50కి చేరింది. ముంబైలో ధరలు రూ.1,605 నుంచి రూ.1,644కి, చెన్నైలో ధర రూ.1,817 నుంచి రూ.1,855కి పెరిగాయి. 2024 అక్టోబర్ 1న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF), CNG-PNG (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, పైప్డ్ నేచురల్ గ్యాస్) కొత్త ధరలు కూడా ప్రకటిస్తారు. ఈ ధర మార్పులు నేరుగా రవాణా ఖర్చు, గృహ ఇంధన బిల్లులపై ప్రభావం చూపుతాయి. 2024 సెప్టెంబర్‌లో ATF ధరలు తగ్గాయి. ఢిల్లీలో ATF కిలోలీటర్‌కు రూ.97,975.72 నుంచి రూ.93,480.22కి పడిపోయింది. కోల్‌కతాలో కూడా రూ.1,00,520.88 నుంచి రూ.96,298.44కి, ముంబైలో రూ.91,650.34 నుంచి రూ.87,432.78కి తగ్గింది. చెన్నైలో కిలోలీటర్ రూ.1,01,632.08 నుంచి రూ.97,064.32కి చేరింది. ఈ తగ్గింపులతో విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. ఫలితంగా విమాన ఛార్జీలు తగ్గుతాయి. CNG-PNG ధరల మార్పులు రవాణా, గృహ ఇంధన ఖర్చులను ప్రభావితం చేయవచ్చు.
ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్ లెవల్ ఆఫీసర్స్ బదిలీ! ఎందుకో తెలుసా?
ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక రేషన్ టెన్షన్ లేనట్లే! ఇదే జరిగితే, ఏర్పాటు చేస్తే లబ్దిదారులకు!
పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!
అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట!
నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారు? ఎవరు?
అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి! మరీ ఇంత దారుణమా - అసలు ఏమి జరిగింది అంటే!
విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్! పోస్టుల భర్తీ ప్రమాణాలు పెంచేలా చర్యలు!
విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన! కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు!
ఏపీలో వైన్ షాపులకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్! గవర్నర్ రేపు ఆమోదముద్ర వేసే అవకాశం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: