వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఇచ్చిన ఓ ఆదేశం అమల్లో భాగంగా తాజాగా ఆమెకు హైకోర్టు మరో షాకిచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి విశాఖలో నిర్మించుకున్న ఓ కట్టడం అక్రమమని తేల్చిన హైకోర్టు...దాన్ని కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అంతటితో ఆగకుండా ఇదే అంశంలో ఆమెకు మరో షాకిస్తూ తాజాగా జీవీఎంసీకి ఆదేశాలు జారీ చేసింది. విశాఖ బీచ్ రోడ్డులో సీఆర్ఈజడ్ నిబంధనలు ఉల్లంఘించి నేహారెడ్డి నిర్మించిన ఓ కాంక్రీట్ కట్టడాన్ని జీవీఎంసీ పట్టించుకోవడం లేదని గతంలో జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించన హైకోర్టు.. దాన్ని కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
ఇంకా చదవండి: కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడికి కీలక పదవి! తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం!
దీంతో జీవీఎంసీ అధికారులు ఆ కట్టడాన్ని తాజాగా కూల్చేశారు. అయితే దీనిపై తదుపరి విచారణలో హైకోర్టు ఆ కూల్చివేతకు అయిన ఖర్చు కూడా నేహారెడ్డి నుంచే వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో హైకోర్టు ఆదేశాలు ఆమెకు మరో షాకిచ్చినట్లయింది. నేహారెడ్డి అక్రమ నిర్మాణంపై హైకోర్టులో జరిగిన విచారణలో ప్రభుత్వ న్యాయవాది ఆమెకు షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. ఆ నిర్మాణం కూల్చివేతతో పాటు అందుకు అయిన ఖర్చు కూడా ఆమె నుంచి వసూలు చేయాలని, ఆ వివరాలు కూడా కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో గతంలో ఇదే నిర్మాణాన్ని చూసీ చూడనట్లు వదిలేసి, ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో కూల్చిన జీవీఎంసీ అధికారులు అందుకు తామే ఖర్చుపెట్టారా లేక ఆ ఖర్చును నేహారెడ్డి నుంచి వసూలు చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇంకా చదవండి: టోల్ గేట్లలో కీలక మార్పులు! ఇక ఆ వాహనదారులకు చార్జీలు ఉండవు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
18 ఏళ్లు నిండిన వారికి భారీ శుభవార్త.. 13వ తేదీన అస్సలు మిస్ అవ్వకండి!
ఏపీ సర్కార్ మరో శుభవార్త.. రైతన్నలకు రూ.2.50 లక్షలు! కచ్చితంగా రైతులకు పాడి పశువులు!
గచ్చిబౌలిలో రహస్య రేవ్ పార్టీపై పోలీసుల దాడి! ప్రభుత్వ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై కేసు!
గోదావరి వరద ప్రాంతాల కు ముఖ్యమంత్రి పర్యటన! కొల్లేరు పరివాహక ప్రాంతాలపై సర్వే!
మందుబాబులకు కిక్కే కిక్కు! ఏపీలో నూతన మద్యం పాలసీపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ!
తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వీటి ధరలు భారీగా తగ్గింపు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!
రూ.2 లక్షలు తక్కువకే కొత్త కారు కొనేయండి! మళ్లీ మళ్లీ రాని భారీ ఆఫర్లు!
అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: