బ్యాంకులు.. గృహ నిర్మాణాలకు, ఇతర బిజినెసు పనులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రస్తుతం అయితే ఏ రైతు కైనా సరే పశువులు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన పశుగ్రాసం కోసం కూడా రుణాలు ఇస్తారన్న సంగతి తెలుసా… అందుకు ఏమేమీ పత్రాలు అవసరం అవుతాయి.. ఆ పశుగ్రాసం కోసం మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా మనం లబ్ది పొందచ్చు, తిరిగి బ్యాంకుకు ఎంత చెల్లించాలి అనే సమాచారం లోకల్ 18 ద్వారా పశు వైద్య అధికారిణి రాధా సంధ్య తెలిపారు. నంద్యాల జిల్లా పగిడాల మండల పరిధిలో ముచ్చుమారి గ్రామంలో పశువుల కోసం పశుగ్రాసం పొందేందుకు రుణాలను బ్యాంకు నుంచి ఏ విధంగా పొందాలి అనే సమాచారాన్నిపశు వైద్య అధికారిణిరాధా సంధ్య తెలిపారు. రైతులకు సంబంధించిన పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పొందేందుకు వీలుంటుంది. పశువులు ఉన్న రైతన్నల కోసం మేత ఖర్చు కోసం బ్యాంక్ ద్వారా ఆ రుణ సదుపాయాన్నిప్రభుత్వం కల్పిస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన ఆదేశాల మేరకు వీటిని అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కచ్చితంగా రైతులకు పాడి పశువులు ఉండాలి.
ఇంకా చదవండి: గోదావరి వరద ప్రాంతాల కు ముఖ్యమంత్రి పర్యటన! కొల్లేరు పరివాహక ప్రాంతాలపై సర్వే!
దీనిని బ్యాంకులో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీటితోపాటు రైతుకు సంబంధించిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పొలానికి సంబంధించిన పాస్ బుక్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, తరువాత పశువులు ఉన్నట్లుగా పశు వైద్య అధికారి ద్వారా ఒక ధ్రువీకరణ పత్రాన్ని పొందాల్సి ఉంటుంది. రైతుకు భూమి ఉన్నట్లయితే ఆ భూమికి సంబంధించిన పత్రాన్ని ఆ అప్లికేషన్ కి జతచేసి, పశు వైద్యశాలలో ఇచ్చినట్లయితే, వారు బ్యాంకు వారికి పంపించడం జరుగుతుందన్నారు. ఇందులో ఋణం ఏ విధంగా మంజూరు చేస్తారంటే.. ఒక రైతుకు వచ్చేసి గరిష్టంగా లక్ష అరవై వేల రూపాయల వరకు ఈ సదుపాయం వర్తిస్తుంది. ఇందులో రైతు తీసుకున్న డబ్బులకు, వడ్డీ వచ్చేసి 75 పైసలు కట్టవలసి ఉంటుంది. ఈ డబ్బును సంవత్సరంలోపు రీపేమెంట్ ద్వారా నెల కొంత అమౌంట్ను బ్యాంకుకు తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఏ రైతు అయితే వారికి నిర్దేశించిన టైం లోపు డబ్బును రీపేమెంట్ చెయ్యగలుగుతారో అలాంటి రైతన్నలకు వారు కట్టినటువంటి వడ్డీ లో నుంచి 30% డబ్బులు రైతుకు రిటర్న్ ఇస్తారు. ఇలా ప్రతి నెలా కట్టినట్లయితే 4% రైతుకు రిటర్న్ ఇస్తారు. రూ. 1,60,000 ఎక్కువ రుణం అంటే రెండు లక్షల 50 వేలు కావాలంటే రైతుకు సంబంధించిన పొలం పాస్ బుక్కులు బ్యాంక్ వారికి ఇవ్వాల్సి ఉంటుంది. రైతుకు సంబంధించిన రెండు ఎకరాల 50 సెంట్లు పైగా ఉన్న పాసు బుక్కులను ఆ అప్లికేషన్ కు జతపరిచి ఇవ్వాల్సి ఉంటుంది.
ఇంకా చదవండి: ఏపీ మహిళలకు మనీ ఇచ్చేలా రెండు కీలక పథకాలు.. 35 శాతం రాయితీ! అప్లై చేసుకోవాలి అనుకునేవారు ఇలా ఫాలో అవండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గచ్చిబౌలిలో రహస్య రేవ్ పార్టీపై పోలీసుల దాడి! ప్రభుత్వ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై కేసు!
మందుబాబులకు కిక్కే కిక్కు! ఏపీలో నూతన మద్యం పాలసీపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ!
తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వీటి ధరలు భారీగా తగ్గింపు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!
రూ.2 లక్షలు తక్కువకే కొత్త కారు కొనేయండి! మళ్లీ మళ్లీ రాని భారీ ఆఫర్లు!
అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: