వైసీపీ పాలనలో చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆ రోజు ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారని, ఈరోజు భారీ వరదల కారణంగా ప్రజలు కన్నీళ్లు పెట్టుకోకూడదని సీఎం నిత్యం కష్టపడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును అరెస్ట్ చేసి నేటికి సరిగ్గా ఏడాది అవుతుందన్నారు. నాడు ప్రతిపక్ష హోదాలో, నేడు సీఎంగా ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నారన్నారు. బుడమేరు కట్ట మీద మట్టిని దోచుకెళ్లారని, వైసీపీ చేసిన పనికి ఇప్పుడు విజయవాడ మునిగిపోయిందని ఆరోపించారు. భారీ వరదల సమయంలో పడవలు తీసుకువచ్చి ప్రకాశం బ్యారేజీని దెబ్బతీసే ప్రయత్నం చేశారన్నారు.
ఇంకా చదవండి: ఎమ్మెల్యే తృటిలో తప్పిన పెను ప్రమాదం! ఆలపాడు - కొల్లేటికోట రహదారి పూర్తిగా!
తొమ్మిది రోజులుగా చంద్రబాబు కలెక్టరేట్‌లోనే ఉండి కేంద్రమంత్రులను పిలిపించుకొని వరద పరిస్థితులను వారికి వివరించినట్లు చెప్పారు. ఆ రోజు చంద్రబాబును అరెస్ట్ చేయడం హెడ్ లైన్ అయిందేమో.. కానీ ప్రజలు మాత్రం వైసీపీకి అధికారం లేకుండా చేశారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. నాడు చంద్రబాబును తప్పుడు కేసులో అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కేవలం అమరావతి మీదే కాదు.. విజయవాడ మీద కూడా పగబట్టారన్నారు. రుషికొండపై సమీక్ష చేసిన జగన్ బుడమేరుపై కూడా సమీక్ష చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. చంద్రబాబును చూసి జగన్ నేర్చుకోవాలని హితవు పలికారు.
ఇంకా చదవండి: అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!
మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!
వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొనసాగుతున్న వైసీపీ నేతల రాజీనామాల పర్వం! కారణం?
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!
టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!
భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!
ఇక వరదలకు చెక్.. బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రణాళిక! మంత్రుల కీలక వ్యాఖ్యలు!
స్టార్ హీరోలను మించి! ఏపీ, తెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!
హైదరాబాదులోని అమెరికా కౌన్సిలేట్లో ఉద్యోగ అవకాశాలు! వెంటనే అప్లై చేసుకోండి ఇలా! జీతం ఎంతంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: