ఏపీలోని ఏలూరు జిల్లాలో వైసీపీ నేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఒక్కొక్కరుగా కీలక నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా ఉమ్మడి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు పార్టీకి గుడ్‌బై చెప్పారు. గురువారం మీడియా సమావేశం నిర్వహించిన ఈ దంపతులు వైసీపీకి రాజీనామా ేశామని, త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రకటించారు. అలాగే తమ రాజీనామా లేఖలను పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ.. గత 13ఏళ్లుగా వైసీపీలో పని చేశానని, వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వంలో ప్రజలకు సేవలు అందించడానికి తాము త్వరలోనే జనసేనలో చేరుతున్నట్లు ఆమె తెలిపారు. అలాగే వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావు మాట్లాడుతూ తాను పార్టీకి రాజీనామా చేయడానికి తన వ్యక్తిగత కారణాలేనని పేర్కొన్నారు.
ఇంకా చదవండి: రేషన్, ఆధార్ లేకపోయినా బాధ లేదు! ఉచితంగానే బియ్యం, నూనె, కందిపప్పు! ఎలా అని అనుకుంటున్నారా?
ఇక ఇటీవల ఏలూరులో వైసీపీకి వరుసగా కీలక నేతలు అయిన మాజీ డిప్యూటీ సీఎం, ఆ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, మేయర్ నూర్జహాన్, ఆమె భర్త పెదబాబు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జడ్పీ ఛైర్‌పర్సన్ దంపతులు పార్టీని వీడారు. అంతకుముందు ఏలూరు నియోజకవర్గ ముఖ్య నేతలైన ఇడా మాజీ ఛైర్మన్ బొద్దాని శ్రీనివాస్, ఏలూరు మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ మంచెం మైబాబు పార్టీకి రాజీనామా చేశారు. అటు వైసీపీకి చెందిన 19 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి జంప్ అయ్యారు. మేయరు దంపతులతో పాటు బొద్దాని మైబాబు సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోవడంతో ఏలూరు నియోజకవర్గంలో ప్రతిపక్షం లేకుండా పోయింది.
ఇంకా చదవండి: ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు బిగ్ షాక్! చుక్కలు చూపించిన అధికారులు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!
బుడమేరుకు పెరుగుతున్న వరద! విజయవాడ వీధుల్లోకి నీళ్లు!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం! టీడీపీ నుండి ఎమ్మెల్యే సస్పెన్షన్!
ఏలూరులో వైసీపీకి మరో బిగ్ షాక్! పార్టీకి సీనియర్ నేత గుడ్ బై!
వరద ప్రవాహం తగ్గడంతో... కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజి మరమ్మత్తుల పనులు!
వైసీపీ కి షాక్.. వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్! ఎందుకో తెలుసా?
వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేదు అనుభవం! దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చిన వరద బాధితులు! ఎందుకంటే..!
ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!
ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!
గొప్ప మనసు చాటుకున్న భువనేశ్వరి! తెలుగు రాష్ట్రాలకు రూ.2కోట్ల విరాళం ప్రకటించిన!
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించని పవన్ కల్యాణ్.. కారణమెంటో చెప్పిన డిప్యూటీ సీఎం!
ఏపీలో ప్రకృతి ప్రకోపం.. వరద బాధితుల కోటి విరాళం అందించిన టీడీపీ ఎంపీ!
తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం ప్రకటించిన హీరో మహేశ్ బాబు! ఎంతో తెలుసా?
ప్రియురాలిని కలవడానికి బురఖాలో వెళ్లిన యువకుడు.. చివరికి జరిగింది ఇదీ! సోషల్ మీడియాలో వైరల్!
నారా లోకేశ్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు! 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా!
విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద! ఈరోజు 8 వేల క్యూసెక్కుల ప్రవాహం!
ప్రభాస్, అల్లు అర్జున్ ఉదారత.. భారీ విరాళాలు ప్రకటించిన స్టార్స్! ఎంతో తెలుసా?
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు సహా నలుగురు భారతీయులు మృతి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: